For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖేష్ అంబానీ సూపర్.. ప్రపంచ 2వ బిగ్గెస్ట్ బ్రాండ్‌గా రిలయన్స్

|

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోనే అతిపెద్ద బ్రాండ్స్‌ల్లో రెండో స్థానంలో నిలిచింది. అమెరికా టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ తర్వాత రిలయన్స్.. ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ 2020 లిస్ట్‌లో దూసుకెళ్లింది. శాంసంగ్, మైక్రోసాఫ్ట్ వంటి వాటిని మించిపోయింది. ఈ జాబితాలో శాంసంగ్ మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా ఎన్విడియా, మౌటాయ్, నైక్, మైక్రోసాఫ్ట్, ఏఎస్‌ఎంఎల్, పేపల్, నెట్‌ఫ్లిక్స్ ఉన్నాయి. పేపాల్, దనాహెర్, సౌదీ ఆరాంకో, అమెరికన్ టవర్ కార్పోరేషన్‌లకు కూడా ఈ జాబితాలో చోటు దక్కింది. రిలయన్స్ వృద్ధిపథంలో దూసుకెళ్తూ కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తూ కొత్త ఆలోచనలతో పరుగులు పెడుతోందని ఫ్యూచర్ బ్రాండ్ ఈ సందర్భంగా పేర్కొంది.

'ఫ్యామిలీతో న్యూఇయర్ బ్రేక్ కావాలి, రూ.1 లక్ష వెచ్చిస్తాం''ఫ్యామిలీతో న్యూఇయర్ బ్రేక్ కావాలి, రూ.1 లక్ష వెచ్చిస్తాం'

ముఖేష్ అంబానీ చర్యలే.. మార్కెట్ క్యాప్ ఆధారంగా కాదు..

ముఖేష్ అంబానీ చర్యలే.. మార్కెట్ క్యాప్ ఆధారంగా కాదు..

గత ఆరేళ్లలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపార రంగంలో ఎన్నోమార్పులు వచ్చాయని, సంస్థల ప్రాధాన్యాలు మారాయని ఫ్యూచర్ బ్రాండ్ తెలిపింది. పెట్రో రసాయనాల సంస్థగా ఉన్న రిలయన్స్‌ను, అనేక రంగాలకు విస్తరించేందుకు కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ తీసుకున్న చర్యలే కంపెనీని ఈస్థాయికి తీసుకువచ్చాయని పేర్కొంది. కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా కాకుండా ఆయా కంపెనీలపై ప్రజలకు ఉన్న అభిప్రాయాలపరంగా ఈ సూచీని రూపొందించినట్లు ఫ్యూచర్ బ్రాండ్ తెలిపింది.

కొత్తగా చేరి టాప్ 2గా నిలిచి

కొత్తగా చేరి టాప్ 2గా నిలిచి

ఫ్యూచర్ బ్రాండ్ 2020 ఇండెక్స్‌లో కొత్తగా 15 సంస్థలకు చోటు దక్కింది. ఇందులో ఏకంగా 7 టాప్ 20లో నిలిచాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండో స్థానంలో నిలిచింది. సూచీలో తొలిసారి చోటు దక్కించుకోవడంతో పాటు అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించినట్లు ఫ్యూచర్ బ్రాండ్ తెలిపింది. నైతిక విలువలు పాటిస్తూ సాగుతోందని, ఈ సంస్థతో వినియోగదారులకు విడదీయలేని అనుబంధం ఉందని తెలిపింది. వన్ స్టాప్ షాప్ సంస్థను తీర్చిదిద్దడంలో ముఖేష్ అంబానీ చేసిన కృషే రిలయన్స్ విజయానికి కారణమని తెలిపింది. ఓ వైపు ప్రస్తుతం పెట్రో రసాయనాల వ్యాపారాన్ని వృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు తెలిపింది. అలాగే వినియోగదారుల అవసరాలను తీర్చే డిజిటల్ సంస్థను అభివృద్ధి చేశారని పేర్కొంది.

ప్రపంచ నెంబర్ 1గా చూసే అవకాశం

ప్రపంచ నెంబర్ 1గా చూసే అవకాశం

ఇంధనం, పెట్రో రసాయనాలు, జౌళి, సహజ వనరులు, రిటైల్, టెలి కమ్యూనికేషన్స్ ఇలా వివిధ విభాగాల్లో అడుగు పెట్టింది. ప్రపంచ దిగ్గజ సంస్థలు రిలయన్స్‌లో వాటాలు తీసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ముందు ముందు రిలయన్స్‌ను ప్రపంచ నెంబర్ వన్ స్థానంలో చూసే అవకాశాలు లేకపోలేదని ఫ్యూచర్ బ్రాండ్ తెలిపింది.

కంపెనీలకు సవాళ్లు

కంపెనీలకు సవాళ్లు

ఫ్యూచర్ బ్రాండ్ సూచీల్లో కొత్తగా చోటు దక్కించుకున్న రిలయన్స్ ఏకంగా రెండో స్థానం దక్కించుకుంది. ఏఎస్ఎంఎల్ హోల్డింగ్స్, పేపాల్, డన్‌హర్, సౌదీ ఆరామ్‌కో, అమెరికన్ టవర్ కార్పోరేషన్ కూడా కొత్తగా చేరాయి. ఆరేళ్ల క్రితం తొలి ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్‌ను విడుదల చేసిన నాటి నుంచీ చూస్తే ప్రపంచ పరిస్థితులు, ప్రాధాన్యతలు వేగంగా మారినట్లు ఫ్యూచర్ బ్రాండ్ పేర్కొంది. టాప్ 100 వరల్డ్ కంపెనీలు అనూహ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. గడచిన ఏడాదిలో ఈ తరహా సవాళ్లు ఎక్కువయ్యాయని తెలిపింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర ఆరోగ్య సంక్షోభం నెలకొందని తెలిపింది.

English summary

ముఖేష్ అంబానీ సూపర్.. ప్రపంచ 2వ బిగ్గెస్ట్ బ్రాండ్‌గా రిలయన్స్ | Reliance second biggest brand globally after Apple

Billionaire Mukesh Ambani’s oil-to-telecom conglomerate Reliance Industries has been ranked second biggest brand after Apple on the FutureBrand Index 2020.
Story first published: Thursday, August 6, 2020, 8:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X