For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బోగస్ జియోమార్ట్ వెబ్‌సైట్స్, రిలయన్స్ రిటైల్ హెచ్చరిక

|

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ రిటైల్ బోగస్ జియోమార్ట్ ఫ్రాంచైజీలపై హెచ్చరించింది. జియో మార్ట్ పేరుతో ఫ్రాంచైజీలను ఆహ్వానిస్తున్న నకిలీ వెబ్‌సైట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని రిలయన్స్ రిటైల్ సూచించింది. ప్రస్తుతం తాము ఎలాంటి డీలర్‌షిప్స్, ఫ్రాంచైజీ విధానాన్ని నిర్వహించడం లేదని తెలిపింది. కొంతమంది బోగస్ వెబ్ సైట్స్‌ను సృష్టించి జియో మార్ట్ సేవల పేరుతో ఫ్రాంచైజీలను ఇస్తూ మోసగిస్తున్నారని తమ వద్దకు సమాచారం వచ్చిందని తెలిపింది.

 మాకు ఆసక్తి లేదు.. మేం రేసులో లేం!: టిక్‌టాక్ కొనుగోలుపై సుందర్ పిచాయ్ మాకు ఆసక్తి లేదు.. మేం రేసులో లేం!: టిక్‌టాక్ కొనుగోలుపై సుందర్ పిచాయ్

తాము డీలర్‌షిప్స్, ఫ్రాంచైజీల విధానాన్ని ప్రస్తుతం అమలు చేయడం లేదని స్పష్టం చేసింది. అదే సమయంలో ఏజెంట్స్‌ను కూడా నియమించలేదని తేల్చి చెప్పింది. ప్రాంచైజీ వ్యక్తుల నియామకానికి తాము ఎలాంటి ఛార్జీలు విధించమని, ఇలాంటి మోసాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తమ బ్రాండ్ పేరుతో దెబ్బతీసే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపింది.

Reliance Retail warns of fake JioMart websites seeking franchisees

ఇందుకు సంబంధించిన సమాచారాన్ని రిలయన్స్ రిటైల్ తమ అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా కూడా తెలియజేసింది. ప్రస్తుతం తాము ఎలాంటి డీలర్‌షిప్ లేదా ఫ్రాంచైజీ మోడల్‌ను అమలు చేయడం లేదని, ఏజెంట్స్‌ను, డీలర్స్‌ను కూడా అపాయింట్ చేయలేదని తెలియజేసింది. తాము గుర్తించిన బోగస్ వెబ్ సైట్స్ పేర్లను కూడా జియో మార్ట్ వెల్లడించింది.

English summary

బోగస్ జియోమార్ట్ వెబ్‌సైట్స్, రిలయన్స్ రిటైల్ హెచ్చరిక | Reliance Retail warns of fake JioMart websites seeking franchisees

Reliance Retail Ltd's online grocery shopping portal JioMart has warned of fake websites seeking franchisees in its name, saying it is not operating any dealership or franchisee model at present.
Story first published: Friday, August 28, 2020, 8:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X