For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Reliance: మరో కంపెనీ మీద కన్నేసిన అంబానీ.. పరుగెడుతున్న స్టాక్.. ఇన్వెస్టర్ల తియ్యటి వేడుక..

|

Reliance Retail: రిలయన్స్ రిటైల్ విస్తరణ చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా సాగుతోంది. కిరాణా రిటైల్ అండ్ హోల్ సేల్ విభాగాల్లో కంపెనీ స్టోర్లతో పాటుగా జియో మార్ట్ పెరుతో సేవలను మారు మూలలకు సైతం చేరువచేసే పనిలో ఉంది. దీని కోసం కంపెనీ అనేక కంపెనీలను, బ్రాండ్లను హస్తగతం చేసుకుంటోంది. అలా రిటైల్ విభాగానికి కొత్త మెరుగులు దిద్దుతూ కస్టమర్లను ఆకర్షించేపనిలో విజయవంతంగా అంబానీ కుమార్తె ఇషా ప్రయాణిస్తున్నారు.

చాక్లెట్ కంపెనీ..

చాక్లెట్ కంపెనీ..

దేశంలో చాక్లెట్ల తయారీలో ఉన్న లోటస్ కంపెనీ మనలో చాలా మందికి పరిచయం ఉన్నదే. అయితే ఈ కంపెనీలో 51 శాతం మెజారిటీ వాటాలను కొనుగోలు చేయనున్నట్లు రిలయన్స్ రిటైల్ ప్రకటించింది. దీంతో కంపెనీ షేర్లు డిసెంబర్ 30న స్టాక్ మార్కెట్లో 5 శాతం లాభపడి అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. అదనంగా రిలయన్స్ రిటైల్ కూడా 26 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ఓపెన్ ఆఫర్ చేస్తుంది.

BSEలో షేర్ పరుగులు..

BSEలో షేర్ పరుగులు..

రిలయన్స్ కొనుగోలు నేపథ్యంలో లోటస్ చాక్లెట్ కంపెనీ షేర్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లాభాలతో ప్రారంభమయ్యాయి. 5 శాతం పెరిగిన తర్వాత స్టాక్ ధర రూ.122.95 వద్ద ప్రారంభమైంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ గ్రూప్ 72 శాతం వాటాను కలిగి ఉంది. కంపెనీ కేవలం రూ.44.21 కోట్ల ఉచిత ఫ్లోట్ మార్కెట్ క్యాప్‌ను కలిగి ఉంది.

డీల్ వివరాలు ఇలా..

డీల్ వివరాలు ఇలా..

షేర్ కొనుగోలు ఒప్పందం ప్రకారం రిలయన్స్ రిటైల్ లోటస్ కంపెనీకి చెందిన 6.5 లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయనుంది. ఒక్కో షేరును రూ.113 ధరకు మొత్తం రూ.74 కోట్లకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అనంత్ పి. పాయ్ ప్రకాష్ పి. పాయ్ తమ వాటాలను విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. 33 లక్షల వరకు ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసేందుకు లోటస్ పబ్లిక్ షేర్‌హోల్డర్‌లకు RIL ఓపెన్ ఆఫర్ చేస్తోంది.

ఇషా అంబానీ..

ఇషా అంబానీ..

లోటస్‌లో పెట్టుబడి దేశీయంగా అభివృద్ధి చేయబడిన రోజువారీ వినియోగ అధిక-నాణ్యత ఉత్పత్తులను మరింత పెంచడానికి దోహదపడుతుందని వెంచర్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ అన్నారు. విస్తృత కస్టమర్ స్పెక్ట్రమ్‌ను సరసమైన ధరలకు అందించడానికి తమ నిబద్ధతకు ఇది రుజువుగా నిలుస్తుందని ఆమె అన్నారు.

కంపెనీ లాభాలు..

కంపెనీ లాభాలు..

రెండవ త్రైమాసికంలో లోటస్ చాక్లెట్ కంపెనీ రూ.14.63 కోట్ల నికర అమ్మకాలపై రూ.49 లక్షల నికర నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ అమ్మకాలు రూ.20.95 కోట్లు కాగా రూ.1.52 కోట్ల లాభాన్ని నమోదుచేసింది. 1988లో స్థాపించబడిన లోటస్ కంపెనీ కోకో, చాక్లెట్ ఉత్పత్తుల వ్యాపారంలో కొనసాగుతోంది.

English summary

Reliance: మరో కంపెనీ మీద కన్నేసిన అంబానీ.. పరుగెడుతున్న స్టాక్.. ఇన్వెస్టర్ల తియ్యటి వేడుక.. | Reliance Retail Ventures buying majority stake in Lotus Chocolates stock booming

Reliance Retail Ventures buying majority stake in Lotus Chocolates stock booming
Story first published: Friday, December 30, 2022, 12:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X