For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిలయన్స్ రిటైల్‌లో 'అబుదాబి' రూ.5,513 కోట్ల పెట్టుబడి

|

రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ విభాగం రిలయన్స్ రిటైల్‌లో అబుదాబీ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ(ADIA) రూ.5,513 కోట్ల బిలియన్ డాలర్ల పెట్టుబడితో 1.20 శాతం వాటాను దక్కించుకోనుంది. ఇటీవలి వరకు సిల్వర్ లేక్, కేకేఆర్, జనరల్ అట్లాంటిక్, ముబాదాల, జీఐసీ, టీపీజీలు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశాయు. ఇప్పుడు ADIA పెట్టుబడితో రిలయన్స్ రిటైల్‌లోకి నాలుగు వారాల్లో రూ.37,710 కోట్లు వచ్చాయి.

అమెజాన్ జెఫ్ బెజోస్‌కు రిలయన్స్ ముఖేష్ అంబానీ భారీ ఆఫర్!అమెజాన్ జెఫ్ బెజోస్‌కు రిలయన్స్ ముఖేష్ అంబానీ భారీ ఆఫర్!

ఈ ఒప్పందంలో భాగంగా రిలయన్స్ రిటైల్ మార్కెట్ వ్యాల్యూను రూ.4.285 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. రిలయన్స్ రిటైల్‌లో ఇప్పటి వరకు ఏడు దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు వెట్టి, 8.48 శాతం వాటాను దక్కించుకున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో రిలయన్స్ డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫాంలో రూ.5,683.50 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ADIA 1.16శాతం వాటాను దక్కించుకుంది.

 Reliance Retail gets another cheque: ADIA to invest Rs 5,512 crore

రిలయన్స్ రిటైల్ దేశవ్యాప్తంగా దాదాపు 12,000 స్టోర్స్‌ను కలిగి ఉండి, 640 మిలియన్ల ఫుట్‌ఫాల్స్‌ను అందిస్తోంది. 1976లో స్థాపించిన ADIA అనేది ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టే సంస్థ. ఇది దీర్ఘకాలిక విలువ సృష్టిపై దృష్టి సారించిన వ్యూహం ద్వారా అబుదాబి ప్రభుత్వం తరపున వివేకంతో నిధులను పెట్టుబడిగా పెడుతుంది.

English summary

రిలయన్స్ రిటైల్‌లో 'అబుదాబి' రూ.5,513 కోట్ల పెట్టుబడి | Reliance Retail gets another cheque: ADIA to invest Rs 5,512 crore

Reliance Industries (RIL) on Tuesday said that the Abu Dhabi Investment Authority (ADIA) would invest Rs 5,512.50 crore into subsidiary Reliance Retail Ventures (RRVL) for 1.2-per cent stake.
Story first published: Wednesday, October 7, 2020, 9:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X