For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇదీ మీకు తెలుసా.. ఈ ఏడాది ముఖేశ్ అంబానీ జీతం తీసుకోలేదు... కారణమిదే..

|

కరోనా కరాళ నృత్యం చేస్తోంది. మార్కెట్లు కుదేలైపోయాయి. ఉద్యోగాలు పోతున్నాయి. జీతాలు తగ్గుతున్నాయి. టాప్ కంపెనీల సీఈవోలు ఏం చేయాలి.. జీతంలో కోత విధించుకోవాలి.. భారీగా తగ్గించుకోవాలి. అవును అలానే చేశారు రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ. గత ఏడాది నుంచి ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోలేదు.

జీతం వద్దు..

జీతం వద్దు..

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ 2020-21 ఆర్థిక సంవత్సరంలో నయా పైసా జీతం తీసుకోలేదు. కోవిడ్-19 మహమ్మారి ప్రభావం వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉండటంతో ఆయన తన పారితోషికాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారు. రిలయన్స్ సంస్థ తాజా వార్షిక నివేదికలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో అంబానీ పారితోషికం ''శూన్యం'' అని పేర్కొంది.

ఏడాదికి రూ.15 కోట్లు

ఏడాదికి రూ.15 కోట్లు

అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.15 కోట్లు జీతం పొందారు. పదకొండేళ్ళ నుంచి ఆయన ఇదే విధంగా జీతం తీసుకుంటున్నారు. 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి ఆయన తన జీతం, భత్యాలు, కమిషన్ కలిపి రూ.15 కోట్లకు పరిమితం చేసుకున్నారు. సంవత్సరానికి దాదాపు రూ.24 కోట్లకు పైగా ఆయన వదులుకున్నారు.

శాలరీ వద్దని చెప్పి

శాలరీ వద్దని చెప్పి

రిలయన్స్ ఇండస్ట్రీస్ గత ఏడాది జూన్‌లో విడుదల చేసిన ప్రకటనలో, భారత దేశంలో కోవిడ్-19 మహమ్మారి ప్రభావం సమాజం, ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక రంగాలపై తీవ్రంగా పడినందువల్ల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ డి అంబానీ తన జీతాన్ని వదులుకోవాలని స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నట్లు తెలిపింది.

వారికి మాత్రం పెరిగాయి..

వారికి మాత్రం పెరిగాయి..

రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పీఎంఎస్ ప్రసాద్, పవన్ కుమార్ కపిల్ పారితోషికాలు పెరిగాయి. వారు రెండేళ్ళలో తమ పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలను పొందారు. ప్రసాద్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.11.99 కోట్లు పొందారు. అంతకుముందు సంవత్సరం ఆయన రూ.11.15 కోట్లు పొందారు. కపిల్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.4.24 కోట్లు పొందారు. అంతకుముందు ఏడాది ఆయనకు రూ.4.04 కోట్లు లభించింది.

English summary

ఇదీ మీకు తెలుసా.. ఈ ఏడాది ముఖేశ్ అంబానీ జీతం తీసుకోలేదు... కారణమిదే.. | Reliance mukesh ambani did not take salary for 2020-21 year

Reliance mukesh ambani did not take salary for 2020-21 financial year for corona pandemic.
Story first published: Thursday, June 3, 2021, 18:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X