For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కస్టమర్లకు రిలయన్స్ జియో మరోసారి భారీ షాక్, త్వరలో టారిఫ్ పెంపు!

|

రిలయన్స్ జియో కస్టమర్లకు మరోసారి షాకిచ్చింది. 2016లో ఉచిత వాయిస్ కాల్స్, తక్కువ ధరకే ఎక్కువ డేటా ఆఫర్లతో టెలికం రంగంలోకి అడుగు పెట్టిన జియో గత ఏడాది చివరలో ఉచిత వాయిస్ కాల్‌ను ఎత్తివేసి తొలి షాక్ ఇచ్చింది. ఇప్పుడు తన కస్టమర్లకు మరో షాకిచ్చేందుకు సిద్ధమైంది. టెలికం రంగంలో సంచలన మార్పులకు కారణమైన ఈ టెల్కో మరోసారి వైర్‌లెస్ డేటా టారిఫ్ పెంచే యోచనలో ఉంది.

Yes bank crisis: సారీ సేవలు బంద్.. ఫోన్‌పే యూజర్లకు చుక్కలుYes bank crisis: సారీ సేవలు బంద్.. ఫోన్‌పే యూజర్లకు చుక్కలు

డేటా ఛార్జీలు పెంపు కోసం..

డేటా ఛార్జీలు పెంపు కోసం..

గత ఏడాది ఉచిత కాల్స్ ఎత్తివేసి, ఛార్జీలను పెంచింది జియో. ఇప్పుడు టారిఫ్ పెంపులో భాగంగా రూ.15గా ఉన్న ఒక GB డేటా ధరను రూ.20కి పెంచాలని భావిస్తోంది. ఈ మేరకు టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ(TRAI)కు లేఖ రాసింది. వాయిస్ కాల్స్ టారిఫ్ విషయంలో మాత్రం మార్పులు కోరుకోవడం లేదు. వాటిని యథావిధిగా కొనసాగించనుంది.

డేటా ధరల పెంపు... ఇప్పుడే కాదు

డేటా ధరల పెంపు... ఇప్పుడే కాదు

GB డేటా ధర పెంపు తక్షణమే ఉండదని, ఆరు నెలల నుండి తొమ్మిది నెలల వ్యవధిలో అమలు చేయాలని భావిస్తున్నట్లు ట్రాయ్‌కు రిలయన్స్ జియో తెలిపింది. పెరిగిన డేటా ధరలు అన్ని టారిఫ్స్‌కు వర్తిస్తాయని పేర్కొంది.

విడతలవారీగా అమలు

విడతలవారీగా అమలు

టెలికం రంగంలో టారిఫ్ సమస్యలపై స్పందించాలని టెలికం ఆపరేటర్లను ట్రాయ్ అంతకుముందు కోరింది. దీనిపై జియో కన్సల్టేషన్ పత్రం సమర్పించింది. కస్టమర్లు తక్కువ ఖర్చుతో సేవలు పొందాలని చూస్తారని, కాబట్టి పెరిగిన టారిఫ్ రెండు మూడు విడతల్లో అమలు చేసేలా వెసులుబాటు కల్పించాలని కోరింది. ఓసారి డేటా ఛార్జీలు అమల్లోకి వచ్చాక అన్ని టారిఫ్, అన్ని సెగ్మెంట్లలో విడతలవారీగా అమలు చేస్తామని పేర్కొంది.

English summary

కస్టమర్లకు రిలయన్స్ జియో మరోసారి భారీ షాక్, త్వరలో టారిఫ్ పెంపు! | Reliance Jio seeks data price hiked to Rs.20 per GB Over six Months

Jio has proposed to TRAI that wireless data prices are gradually increased to ₹20 per GB from ₹15 per GB currently, after six to nine months while suggesting floor rate for data prices.
Story first published: Sunday, March 8, 2020, 8:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X