Reliance Jio Q4: వేల కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్
ముంబై: దేశీయ టెలికం జెయింట్ రిలయన్స్ జియో.. తన నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. జనవరి-ఫిబ్రవరి-మార్చి నెలల కాలంలో 24 శాతం పురోభివృద్ధిని సాధించింది. 4,137 కోట్ల రూపాయల నికర లాభాలను ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి నమోదు చేసిన నికర లాభాలు 3,360 కోట్ల రూపాయలు. ఏడాది తిరిగే సరికి ఈ మొత్తం 4,137 కోట్ల రూపాయలకు చేరింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్‌లో కూడా 15 శాతం వృద్ధి కనిపించింది.
Tata
Ace
EV:
వాణిజ్య
అవసరాల
కోసమూ
కరెంటు
బండ్లు
గత ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల కాలంలో రిలయన్స్ జియో నమోదు చేసిన ఆర్థిక కార్యకలాపాల విలువ 20,901 కోట్ల రూపాయలు. ఇందులో కూడా పురోగమించిందా కంపెనీ. అంతకుముందు ఆర్థిక సంవత్సరం అంటే 2020-2021లో ఇదే చివరి త్రైమాసికంలో సాధించిన వ్యాపార లావాదేవీల విలువ 17,358 కోట్ల రూపాయలు. మొత్తంగా 20 శాతం మేర అభివృద్ధిని సాధించినట్లు రిలయన్స్ జియో యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు రెగ్యులేటరీ వద్ద ప్రతిపాదనలను సమర్పించింది.

ఆర్థిక సంవత్సరం మొత్తానికీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 14,817 కోట్ల రూపాయలుగా చూపించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం 12,015 కోట్ల రూపాయలు. మొత్తం ఆదాయం 76,977 కోట్ల రూపాయలకు చేరింది. ఇది వరకు ఈ మొత్తం 69,888 కోట్ల రూపాయలు. ఆపరేషన్ విషయానికి వస్తే 110 శాతం వృద్ధిని అందుకుంది రిలయన్స్ జియో. ఈ నాలుగో త్రైమాసికంలో ఆపరేషన్స్ విలువ 10,510 కోట్ల రూపాయలుగా నమోదు.
కాగా.. అంతకుముందు సంవత్సరం ఇదే కాలానికి సాధించిన ఆపరేషన్స్ 9,514 కోట్ల రూపాయలు. రిలయన్స్ జియో నమోదు చేసిన ఫలితాలన్నీ అంచనాలను దాటేశాయి. ప్రివ్యూలను అధిగమించాయి. గత సంవత్సరం టారిఫ్‌ను పెంచడం వల్ల అంచనాలకు మించిన నికర లాభాన్ని అందుకున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. ఇతర టెలికం కంపెనీల కంటే రిలయన్స్ జియో అంచనాలకు మించిన వేగంతో ఈ నెట్ ప్రాఫిట్‌ను సాధించినట్లు చెబుతున్నాయి.