For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్కెట్‌లో రిలయన్స్ వెయిటేజీ 17%, మరి అమెరికా స్టాక్స్ మాటేమిటి?

|

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ గతవారం మార్కెట్ క్యాపిటలైజేషన్ 200 బిలియన్ డాలర్ల మార్క్ అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మార్క్ దాటిన కంపెనీలో 50 లోపు ఉన్నాయి. వీడియో స్ట్రీమింగ్ కంపెనీ నెట్‌ఫ్లిక్స్ ఈ జూన్ నెలలో 200 బిలియన్ డాలర్లను అందుకుంది. నెట్ ఫ్లిక్స్ ప్రైస్ టు ఎర్నింగ్ (P/E) 52x గా ఉంటే, రిలయన్స్ 28xగా ఉంది. ఇతర టెక్ దిగ్గజాలు అమెజాన్, టెన్సెంట్, ఫేస్‌బుక్ సంస్థలు కూడా 200 బిలియన్ డాలర్ల మార్క్‌కు చేరుకున్న సమయంలో వ్యాల్యుయేషన్ ఎక్కువగానే ఉంది. విషయానికి వస్తే భారత్ స్టాక్ మార్కెట్ ఎక్కువగా ఒకే స్టాక్‌పై ఆధారపడటంతో దాదాపు భారీగా ఉన్న అమెరికా ఈక్విటీలు ఆరోగ్యంగా కనిపిస్తాయి.

రూ.9 లక్షల కోట్లు దాటిన TCS మార్కెట్ క్యాప్, HCL టెక్ రికార్డ్ గరిష్టంరూ.9 లక్షల కోట్లు దాటిన TCS మార్కెట్ క్యాప్, HCL టెక్ రికార్డ్ గరిష్టం

రిలయన్స్ వాటా 43%, ఫాంగ్ స్టాక్స్ వాటా 22% వాటా

రిలయన్స్ వాటా 43%, ఫాంగ్ స్టాక్స్ వాటా 22% వాటా

మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలో రిలయన్స్ అగ్రస్థానంలో ఉంది. రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.15 లక్షల కోట్లు దాటితే, రెండో స్థానంలో ఉన్న టీసీఎస్ మార్కెట్ క్యాప్ నిన్న రూ.9 లక్షల కోట్లు దాటింది. మార్చి 23వ తేదీన స్టాక్స్ కనిష్టానికి పడిపోయిన తర్వాత నుండి బెంచ్‌మార్క్ ఎస్ అండ్ పీ బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ వాటా పెరుగుదలలో రిలయన్స్ వాటా 43 శాతంగా ఉండటం గమనార్హం. నాటి నుండి రిలయన్స్ షేర్ 164 శాతం పెరుగుదల నమోదు చేసింది. అదే సమయంలో ఎస్ అండ్ పీ 500లో అమెరికా FAANG స్టాక్స్ (ఫేస్‌బుక్, అమెజాన్, ఆపిల్, నెట్‌ఫ్లిక్స్, అల్పాబెట్-గూగుల్) వాటా కేవలం 22 శాతంగా మాత్రమే ఉంది.

సెన్సెక్స్ సూచీలో 17% వాటా

సెన్సెక్స్ సూచీలో 17% వాటా

ఆసియాలోనే అత్యంత ధనికుడు ముఖేష్ అంబానీ. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు ఈ సంవత్సరమే దాదాపు రెండింతలు పెరిగి రూ.16 లక్షల కోట్ల సమీపానికి చేరుకుంది. ప్రధానంగా రిలయన్స్ డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫాంలో ఫేస్‌బుక్, గూగుల్, సిల్వర్ లేక్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు పెట్టుబడులు పెట్టాయి. దీంతో స్టాక్స్ ఎగిశాయి. ఇటీవల రిలయన్స్ రిటైల్‌లోకి కూడా భారీ పెట్టుబడులు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు కూడా స్టాక్స్ ఎగిసిపడుతున్నాయి. రిలయన్స్ రిటైల్‌లో సిల్వర్ లేక్ పెట్టుబడులు పెట్టడంతో పాటు అమెజాన్ చర్చలు జరుపుతోందనే వార్తల నేపథ్యంలోనే రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.15 లక్షల కోట్లు దాటింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో రిలయన్స్ వెయిటేజ్ ఇప్పుడు 17 శాతంగా ఉంది. ఏడాది క్రితం కేవలం 10 శాతంగా మాత్రమే ఉంది. ఈ ఏడాది మార్చి నుండి ఏకంగా 50 శాతానికి పైగా పెరిగింది.

భారత్-అమెరికా మార్కెట్

భారత్-అమెరికా మార్కెట్

రిలయన్స్ మార్కెట్ క్యాప్ అంతకంతకూ పెరుగుతూ సూచీల్లో తన వాటాను క్రమంగా పెంచుకుంటోంది. ఓ విధంగా సింగిల్ స్టాక్ సూచీలో పెనుమార్పులకు కారణం అవుతోంది. స్టాక్స్ హఠాత్తుగా భారీగా పెరగడం, రిస్క్ అంశమేనని మార్కెట్ నిపుణులు అంటున్నారు. భారత్, అమెరికా మార్కెట్‌ను చూసుకుంటే, రిలయన్స్ వాటా 17 శాతానికి పెరగగా, 2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ దాటిన ఐఫోన్ మేకర్ ఆపిల్ ఇంక్ ఎస్ అండ్ పీ 500 కాంట్రిబ్యూషన్ మార్చి నుండి 11 శాతానికి పెరిగింది. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ కార్ప్, అమెజాన్ ఇంక్, ఫేస్‌బుక్ ఇంక్, నెట్ ఫ్లిక్స్ ఇంక్ టాప్ 20 కాంట్రిబ్యూటర్లలో లేవు. వీటి వెయిటేజీ 0.7 శాతంగా ఉంది.

English summary

మార్కెట్‌లో రిలయన్స్ వెయిటేజీ 17%, మరి అమెరికా స్టాక్స్ మాటేమిటి? | Reliance isn't like FAANG: Think US stock market gains are concentrated?

The Indian stock market’s extreme reliance on just a single stock almost makes top heavy U.S. equities look healthy.
Story first published: Tuesday, September 15, 2020, 19:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X