For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖేష్ అంబానీ రిలయన్స్ మరో ఘనత, IOCని దాటి నెంబర్ 1గా...

|

ముంబై: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) మరో ఘనత సాధించింది. గత ఆర్థిక సంవత్సరం 2018-19లో రూ.5.81 లక్షల కోట్ల ఆదాయంతో భారత్‌లో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. ఫార్చ్యూన్ ఇండియా 500 జాబితాలో పదేళ్ల పాటు అగ్రస్థానంలో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (IOC)ను RIL వెనక్కి నెట్టింది. ఈ ఘనత సాధించిన తొలి ప్రయివేటు సంస్థగా రిలయన్స్ నిలిచింది.

రిటైల్, టెలికం విభాగాల అండతో కొన్నేళ్లలోనే రిలయన్స్ ఆధాయం గణనీయంగా పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ 41.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. రిలయన్స్ కంటే IOC వృద్ధి 8.4 శాతం (33.1 శాతం) తక్కువగా ఉంది. ఐవోసీతో పోలిస్తే రిలయన్స్ లాభం గత ఏడాది దాదాపు రెట్టింపు అయి రూ.39,588 కోట్లుగా ఉంది. ఐవోసీ మాత్రం రూ.17,337 కోట్లుగా ఉంది.

24x7 NEFT: ఆ గంటలో మాత్రం కుదరదు, ఛార్జీలు, ఆయా బ్యాంకు24x7 NEFT: ఆ గంటలో మాత్రం కుదరదు, ఛార్జీలు, ఆయా బ్యాంకు

Reliance Industries topples IOC to become Indias largest company

టాప్ 10లో వరుసగా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐవోసీ, ఓఎన్జీసీ, ఎస్బీఐ, టాటా మోటార్స్, బీపీసీఎల్, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్, టాటా స్టీల్, కోల్ ఇండియా, టీసీఎస్ ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఓఎన్జీసీ, ఎస్బీఐష టాటా మోటార్స్, బీపీసీఎల్‌లో ఎలాంటి మార్పు లేదు. రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్, టాటా స్టీల్, కోల్ ఇండియా, టీసీఎస్ మాత్రం ఒక్కో స్థానం ఎగబాకాయి.

ఐసీఐసీఐ బ్యాంకు రెండు స్థానాలు మెరుగుపడి 12వ స్థానంలో నిలిచింది. హిండాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఆ తర్వాత ఉన్నాయి. వేదాంత 18వ స్థానానికి పడిపోయింది.

ఫార్చూన్ ఇండియా 2019లో 500 కంపెనీల మొత్తం ఆదాయం 9.53 శాతం, లాభం 11.8 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం, కొనుగోలు, ప్రయివేటు రంగంలో ఒప్పందాలతో 57 కంపెనీలు జాబితాలో చోటు దక్కించుకోలేకపోయాయి. చమురు, గ్యాస్ రంగంలోని 8 కంపెనీలు మొత్తం ఆదాయంలో 22.3 శాతం వాటా కలిగి ఉండగా, బ్యాంకింగ్ రంగో 15.88 శాతం వాటా కలిగి ఉన్నాయి.

English summary

ముఖేష్ అంబానీ రిలయన్స్ మరో ఘనత, IOCని దాటి నెంబర్ 1గా... | Reliance Industries topples IOC to become India's largest company

Boosted by its consumer-facing businesses like organised retail and telecom, Reliance Industries ended state-owned Indian Oil Corporation's (IOC) 10-year reign as India's largest company, topping the Fortune India 500 list.
Story first published: Tuesday, December 17, 2019, 12:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X