For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Reliance: ధీరూభాయ్ అంబానీ పుట్టినరోజు స్పెషల్.. ముఖేష్ అంబానీ పెద్ద ప్లాన్.. బిగ్ డీల్..

|

Reliance: రిలయన్స్ ఇండస్ట్రీస్ అనగానే అందరికీ గుర్తొచ్చేది నమ్మకం. ఆ నమ్మకాన్ని వినియోగదారులతో పాటు ఇన్వెస్టర్లలో నింపింది మాత్రం ఫౌండర్ అయిన ధీరూభాయ్ అంబానీ అని చెప్పుకోవాలి. భారత వ్యాపార రంగంలో ఆయనది ప్రత్యేకమైన స్థానం. ఆయన తెచ్చిన పేరును ఆయన వారసులు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ ఈ సారి కూడా దేశంలోని అత్యంత విలువైన కంపెనీల జాబితాలో మెుదటి స్థానంలో నిలిచింది. 2016 తర్వాత అంబానీ ఫోకస్ పెట్రోకెమికల్స్ నుంచి ఇతర వ్యాపారాల విస్తరణకు మార్చారు.

ముఖేష్ అంబానీ ప్లాన్..

ముఖేష్ అంబానీ ప్లాన్..

దేశంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్న వ్యాపారవేత్తల్లో అంబానీ కూడా ముందు వరుసలోనే ఉన్నారు. కంపెనీల పగ్గాలను నవతరానికి అప్పగించిన తర్వాత ఆయన వ్యాపారాల విస్తరణ మరింత వేగం పుంజుకుందని చెప్పుకోవాలి. దేశంలో రెండో అత్యంత సంపన్నుడైన అంబానీ జర్మన్ రీటైలర్ మెట్రో ఏజీ క్యాష్ అండ్ క్యారీ వ్యాపారాన్ని కొనుగోలు చేయనున్నారు. ఈ ఒప్పందం దాదాపుగా ఖరారైందని సమాచారం.

 ధీరూభాయ్ పుట్టినరోజు..

ధీరూభాయ్ పుట్టినరోజు..

పారిశ్రామిక దిగ్గజం ధీరూభాయ్ అంబానీ పుట్టినరోజు డిసెంబర్ 28. ఈ సమయానికి మెట్రో డీల్ పూర్తిచేయాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ యోచిస్తోంది. అయితే ఈ డీల్ విలువ దాదాపూ రూ.4,060 కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది. కొనుగోలు తర్వాత వీటిని B2B నుంచి B2C వ్యాపారంగా మార్చాలని అంబానీ ప్లాన్ చేస్తున్నారు. అంటే వీటిని రిలయన్స్ రిటైల్ కిందకు తీసుకురావటంతో డీమార్ట్ కంపెనీకి పెద్ద పోటీదారుగా మారుతుంది. గతంలో మెట్రో హోల్ సేలర్లకు విక్రయాలు జరిపేది కానీ విక్రయం తర్వాత రిటైల్ వినియోగదారులు ఇందులో కొనుగోలు చేసేందుకు వీలు కలగనుంది.

 డీమార్ట్ కు పోటీగా..

డీమార్ట్ కు పోటీగా..

మెట్రోకు దేశవ్యాప్తంగా ప్రస్తుతం 31 హోల్ సేల్ దుకాణాలు ఉన్నాయి. ఇవి రిలయన్స్ గ్రూప్ లో చేరటం వల్ల రిటైల్ వ్యాపారంలో అంబానీ నేరుగా దమానీలకు చెందిన డీమార్ట్ స్టోర్లతో పోటీపడనున్నారు. డీల్ తర్వాత మెట్రో ఇండియా వ్యాపారంతో పాటు దాని హోల్‌సేల్ పంపిణీ కేంద్రాలు, ల్యాండ్ బ్యాంక్‌లు, ఇతర రిటైల్ అవుట్‌లెట్‌లు రిలయన్స్‌కు చెందుతాయి. ప్రస్తుతం మెట్రో రిటైల్ చైన్ వార్షిక ఆదాయం ఒక బిలియన్ డాలర్లుగా ఉంది.

అదరగొడుతున్న RIL..

అదరగొడుతున్న RIL..

2022 హురున్ ఇండియా 500 జాబితా ప్రకారం రెండో ఏడాది కూడా దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. రిలయన్స్ మొత్తం విలువ రూ.17.25 లక్షల కోట్లు కాగా.. కంపెనీ ఏటా 3.6 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. ఈ జాబితాలోని టాప్-10 కంపెనీల మొత్తం వాల్యుయేషన్ రూ.72 లక్షల కోట్లుగా ఉండగా.. దానిలో 25 శాతం రిలయన్స్ ఇండస్ట్రీస్( RIL)కి చెందినది కావటం విశేషం.

English summary

Reliance: ధీరూభాయ్ అంబానీ పుట్టినరోజు స్పెషల్.. ముఖేష్ అంబానీ పెద్ద ప్లాన్.. బిగ్ డీల్.. | Reliance industries to complete metro purchase deal by dhirubhai ambani birthday

Reliance industries to complete metro purchase deal by dhirubhai ambani birthday
Story first published: Sunday, December 4, 2022, 12:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X