For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్లిప్‌కార్ట్-అమెజాన్‌లకు రిలయన్స్ షాక్, ఎన్నో బెనిఫిట్స్‌తో కొత్త జియోమార్ట్

|

ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలతో పోటీ పడనున్నారు. ఇప్పటికే జియో ద్వారా టెలికం రంగంలో కొత్త విప్లవం సృష్టించారు. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంటే మూడేళ్ల క్రితం అడుగుపెట్టిన జియోకే ఎక్కువమంది యూజర్లు ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు జియోమార్ట్‌తో ఈ-కామర్స్ దిగ్గజాలను ఢీకొట్టనున్నారు.

షాకింగ్: 40% ఉన్న 8 కీలక రంగాల ఉత్పత్తి ఎంత పడిపోయిందంటే?షాకింగ్: 40% ఉన్న 8 కీలక రంగాల ఉత్పత్తి ఎంత పడిపోయిందంటే?

జియోమార్ట్

జియోమార్ట్

జియోమార్ట్‌ను ఆవిష్కరిస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్ర్సీ ప్రకటించింది. దీంతో ఆన్‌లైన్ ఫుడ్ అండ్ గ్రాసరీ షాపింగ్ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చినట్లు అయింది. జియోమార్ట్ నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు గట్టి పోటీ తప్పేలాలేదు. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌పైన దృష్టి సారించింది. జియోమార్ట్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా రిలయన్స్ కోరుతోంది. ప్రస్తుతం దేశ్ కీ నయా దుకాన్ పేరిట ముంబైలో ఆన్‌లైన్ సేవలు అందిస్తోంది.

ఆహ్వానాలు

ఆహ్వానాలు

రిలయన్స్ రిటైల్ దీనిని అధికారికంగా ప్రకటించింది. జియో కస్టమర్లందరికీ ప్రాథమిక డిస్కౌంట్ పొందేందుకు నమోదు చేసుకునేందుకు ఆహ్వానాలు పపించనుంది. ప్రస్తుతం మూడు ప్రాంతాల్లో మాత్రమే ఉంది. దీనిని విస్తరించనుంది. జియోమార్ట్ యాప్ కూడా త్వరలో ప్రారంభం కానుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. రూ.50వేలకు పైగా గ్రాసరీ ఉత్పత్తులు కొనుగోలు చేస్తే ఉచిత హోమ్ డెలివరీతో పాటు వేగవంతమైన సేవలు లభిస్తాయని తెలిపింది. ఎక్స్‌ప్రెస్ డెలివరీ సేవలు ఉంటాయి. ఉత్పత్తిని రిటర్న్ చేసే సమయంలో ప్రశ్నలు ఉండవు. జియోమార్ట్‌లో డిస్కౌంట్స్ ఉంటాయి.

త్వరలో జియోమార్ట్ యాప్

త్వరలో జియోమార్ట్ యాప్

ప్రస్తుతం ముంబై, థానే, కళ్యాణ్ ప్రాంతాల్లో ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేసే వారికి జియోమార్ట్ సేవలు సిద్ధంగా ఉన్నాయి. జియోమార్ట్ ప్రారంభాన్ని రిలయన్స్ అధికారులు ధృవీకరించారని తెలుస్తోంది. దీనిని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని చెబుతున్నారు. తమ ఆపరేషన్స్‌ను స్టార్ట్ చేశామని, జియో యూజర్లకు ప్రిలిమినరీ డిస్కౌంట్లు అందించేందుకు జియోమార్ట్‌పై రిజిస్టర్ కావాలని ఆహ్వానాలు పంపిస్తున్నామని చెప్పారు. త్వరలో జియోమార్ట్ యాప్ లాంచ్ చేస్తామన్నారు.

ఒకేతాటి పైకి...

ఒకేతాటి పైకి...

రిలయన్స్ రిటైల్ ఆఫ్‌లైన్ టు ఆన్‌లైన్ (O2O) స్టోర్స్‌ను న్యూకామర్స్ పేరుతో ప్రారంభించనుంది. ఇందులో ఇన్వెస్టర్లు, ట్రేడర్స్, చిన్న వర్తకులు, బ్రాండ్స్, కస్టమర్లు టెక్నాలజీ సాయంతో ఒకేతాటి పైకి వస్తారు. దీనిపై కంపెనీ రెండేళ్లుగా పని చేస్తోంది. ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ సూపర్ మార్కెట్లు, హైపవర్ మార్కెట్లు, హోల్ సేల్, స్పెషాలిటీ, ఆన్‌లైన్ స్టోర్స్ నిర్వహిస్తోంది. ఇప్పుడు కస్టమర్ అవసరమైన వస్తువులను ఆన్ లైన్ ద్వారా పరిశీలించి ఆఫ్ లైన్ స్టోర్‌కు వెళ్లి కొనుగోలు చేయవచ్చు.

అందరికీ ప్రయోజనం

అందరికీ ప్రయోజనం

ఈ పద్ధతి ద్వారా స్థానిక వ్యాపారులు, వినియోగదారులకు ప్రయోజనం కలగనుంది. అదే సమయంలో రిలయన్స్ రిటైల్ ఖర్చులను ఆధా చేసేందుకు, ఆన్ లైన్ రిటైలర్ల పరిధికి వెలుపల ఉన్న స్పేస్‌లోకి ప్రవేశించేందుకు ఉపయోగపడనుంది. దీని ద్వారా 30 మిలియన్ల దుకాణాలను కలుపుకోనున్నారు.

English summary

ఫ్లిప్‌కార్ట్-అమెజాన్‌లకు రిలయన్స్ షాక్, ఎన్నో బెనిఫిట్స్‌తో కొత్త జియోమార్ట్ | Reliance Industries sets up Jiomart to sell grocery online soon

Reliance Industries, India’s biggest company by market value, has started its web portal Jiomart, harnessing the might of its two largest consumer-facing businesses to announce its entry into online food and grocery shopping by early next year.
Story first published: Wednesday, January 1, 2020, 15:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X