For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mukesh Ambani: అదానీని వెనక్కి నెట్టిన అంబానీ.. ఓడలు బండ్లవ్వటమంటే ఇదే..

|

Mukesh Ambani: వ్యాపారం విషయానకి వస్తే ప్రస్తుతం దేశంలో అదానీ-అంబానీల మధ్య పోటీ ఎప్పుడూ తీవ్ర స్థాయిలోనే ఉంటుంది. అయితే గత ఏడాది అనూహ్యంగా భారీ డీల్స్ చేసిన గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో అందనంత ఎత్తుకు చేరుకున్నారు. ఇది ఆసియా నుంచి ఎవ్వరూ సాధించలేకపోయిన ఫీట్. కానీ ఇదంతా గత వైభవంగా మారిపోయింది.

అదానీ పరిస్థితి..

అదానీ పరిస్థితి..

అమెరికా సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్టు పుణ్యమా అని అదానీ కలలో కూడా ఊహించని పతనాన్ని చూస్తున్నారు. ఈ క్రమంలో NIIల సహకారంతో చివరి రోజు అదానీ ఎంటర్ ప్రైజెస్ FPOను గట్టెక్కించారు. అయితే ఈ ఆనందం ఆస్వాధించేలోపే ఆవిరైపోయింది. ఆ రెండు రోజులు లాభాల్లో కొనసాగిన అదానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ మళ్లీ పతన బాటను పట్టింది. ఈ క్రమంలో అదానీ ఆస్తుల విలువ భారీగానే క్షీణించింది.

ముందు వరుసలో అంబానీ

ముందు వరుసలో అంబానీ

..

ఫోర్బ్స్ రియల్ టైమ్ ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ఆస్తులు 0.19 శాతం పెరిగి 64 మిలియన్ డాలర్ల సంపద పెరగడంతో అంబానీ అదానీని అధిగమించారు. ఈ క్రమంలో అదానీ ఆస్తుల విలువ 4.62 శాతం మేర పడిపోయింది. దీంతో ముఖేష్ అంబానీ నికర విలువతో 9వ స్థానంలో నిలవగా.. గౌతమ్ అదానీ 10వ స్థానానికి పరిమితమయ్యారు.

పాతాళానికి అదానీ షేర్లు..

పాతాళానికి అదానీ షేర్లు..

హిండెన్ బర్గ్ ప్రధానంగా ఎత్తిచూపిన వాటిలో ఒకటి అదానీ గ్రూప్ కంపెనీల వాల్యూయేషన్ ఆకాశానికి అంటిందని. పైగా కంపెనీ అప్పులు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని, టాక్సులు ఎగ్గొట్టేందుకు బూటకపు కంపెనీలను వినియోగించినట్లు నొక్కి చెప్పింది. దీంతో కంపెనీల షేర్లు ఫ్రీఫాల్ అవుతున్నాయి. దీనిపై అదానీ గ్రూప్ నష్టనివారణ చర్యలు చేపట్టినప్పటికీ పెద్దగా ఫలించటం లేదు.

 మౌనం పాటిస్తున్న ప్రభుత్వం..

మౌనం పాటిస్తున్న ప్రభుత్వం..

మ్యాటర్ ఈ రేంజ్ లో హీటెక్కిస్తున్నప్పటికీ భారత ప్రభుత్వ వర్గాలు మాత్రం మౌనం ప్రటిస్తున్నాడు. స్టాక్‌ ధర పతనమైన తర్వాత కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఆరోపణలపై మౌనంగా ఉంది. కొన్ని కారణాల వల్ల భారతీయ మ్యూచువల్ ఫండ్స్ చాలా వరకు అదానీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టకుండా తప్పించుకున్నాయి. అదానీ గ్రూప్స్ కు సంబంధించి మనీలాండరింగ్ విషయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఎలాంటి దర్యాప్తు చేయలేదని పార్లమెంటుకు చెప్పబడినట్లు తెలుస్తోంది. మెుత్తానికి పెట్టుబడులు పెట్టిన రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం తమ కష్టార్జితాన్ని నష్టపోతున్నారు.

English summary

Mukesh Ambani: అదానీని వెనక్కి నెట్టిన అంబానీ.. ఓడలు బండ్లవ్వటమంటే ఇదే.. | Reliance industries Mukesh ambani surpassed Goutam Adani in forbes rich list

Reliance industries Mukesh ambani surpassed Goutam Adani in forbes rich list
Story first published: Wednesday, February 1, 2023, 17:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X