For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దక్షిణాది ఎలక్ట్రానిక్ చైన్‌పై రిలయన్స్ కన్ను, రూ.3,000 కోట్ల డీల్!

|

రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో ప్రపంచ దిగ్గజ కంపెనీలకు వాటాలు విక్రయిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశీయంగా పలు కంపెనీలను అక్వైర్ చేసుకుంటోంది. తాజాగా ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియాతో రిలయన్స్ చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. కన్స్యూమర్ డ్యూరబుల్ రిటైల్ చైన్‌ని కొనుగోలు చేసేందుకు రిలయన్స్ రిటైల్ ఆసక్తి చూపుతోంది. ఎలక్ట్రానిక్స్ మార్ట్‌కు దక్షిణ భారత దేశంలో 60 స్టోర్స్‌ ఉన్నాయి. 1200 మంది ఉద్యోగులు ఉన్నారు.

రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు భారీ షాక్: కుప్పకూలిన ఫేవరేట్ స్టాక్స్, రూ.కోట్ల సంపద హుష్‌కాకి!రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు భారీ షాక్: కుప్పకూలిన ఫేవరేట్ స్టాక్స్, రూ.కోట్ల సంపద హుష్‌కాకి!

సమాచారం మేరకు ఎలక్ట్రానిక్ మార్ట్ ఇండియా వ్యాల్యుయేషన్ కోసం సంప్రదింపులు జరుగుతున్నాయట. ఈ డీల్ వ్యాల్యూ రూ.3,000 కోట్ల మేరకు ఉంటుందని అంచనా. ప్రముఖ వ్యాపారవేత్త పవన్ కుమార్ బజాజ్ 1980లో బజాజ్ ఎలక్ట్రానిక్స్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఇది ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా(EMI) అయింది. ఈ అక్వైజేషన్ విజయవంతమైతే రిలయన్స్ రిటైల్‌కు మరింత బూస్ట్ అని చెప్పవచ్చు.

 Reliance in talks to buy electronics chain in South

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దక్షిణాదిన ఎలక్ట్రానిక్ మార్ట్ ఇండియా రిటైల్ స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. ఏసీలు, ఫ్రిజ్‌లు, టీవీలు, కూలర్లు, మొబైల్ అమ్మకాలు ఉంటాయి. దీనిని దక్కించుకుంటే రిలయన్స్ రిటైల్‌కు రిటైల్ మార్కెట్లో మరింత పట్టు దొరుకుతుంది.

English summary

దక్షిణాది ఎలక్ట్రానిక్ చైన్‌పై రిలయన్స్ కన్ను, రూ.3,000 కోట్ల డీల్! | Reliance in talks to buy electronics chain in South

Reliance Retail is in talks with Electronics Mart India, a consumer durables retail chain, for a possible acquisition. Electronics Mart operates 60 stores in South India with 1,200 employees on its roll.
Story first published: Friday, September 25, 2020, 8:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X