రిలయన్స్ డిజిటల్ "డిజిటల్ ఇండియా సేల్" ... భారీ ఆఫర్లతో, డబుల్ బెనిఫిట్స్ తో రిపబ్లిక్ డే అమ్మకాలు
ఈనెల 26వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా ఈ కామర్స్ దిగ్గజాలు ఇప్పటికే రిపబ్లిక్ డే సేల్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అదిరిపోయే ఆఫర్లను, భారీగా డిస్కౌంట్లను ప్రకటించి ఈ కామర్స్ దిగ్గజాలు బిజినెస్లో దూసుకుపోతున్నాయి. బిజినెస్ లో ఈ షాపింగ్ సంస్థలకు ఏమాత్రం తగ్గ మంటూ రిలయన్స్ డిజిటల్ కూడా ముందుకు వచ్చింది.

భారీ డబుల్ ఆఫర్లతో కస్టమర్ల కోసం రిలయన్స్ డిజిటల్
ఈనెల 26వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా రిలయన్స్ డిజిటల్ భారీ డబుల్ ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించడానికి డిజిటల్ ఇండియా సేల్ పేరుతో రంగంలోకి దిగింది. ఇప్పటికే భారీగా ప్రీ బుకింగ్ ఆఫర్ లను ప్రకటించిన రిలయన్స్ డిజిటల్ కస్టమర్లు జనవరి 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు , ప్రీ బుకింగ్ చేసుకుంటే వారికి డబుల్ బెనిఫిట్స్ ను అందించనుంది. దీంతో ప్రీ బుకింగ్స్ కు జనాలు ఎగబడుతున్నారు . ఏదైనా డబుల్ బెనిఫిట్ అని ప్రకటించటంతో కొనుగోళ్లకు ఉత్సాహం చూపిస్తున్నారు .

ఈనెల 22 నుంచి 26 తేదీల్లో డిజిటల్ ఇండియా సేల్ .. ముందుగా ప్రీ బుకింగ్స్
ఇక ఈ డబుల్ బెనిఫిట్ ఎలాగంటే ఉదాహరణకు తమకు నచ్చిన ఎలక్ట్రానిక్ గూడ్స్ కు అడ్వాన్సు గా వెయ్యి రూపాయలు చెల్లిస్తే అదనంగా మరో వెయ్యి రూపాయలు పొందొచ్చు. 2000 చెల్లిస్తే రెండు వేల రూపాయలు అదనంగా పొందొచ్చు. అంతేకాదు వీటికి అదనంగా స్పెషల్ ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా ఉంటాయి. ఈనెల 22 నుంచి 26 తేదీల్లో డిజిటల్ ఇండియా సేల్ కు ముందుగానే ఈ ప్రీ బుకింగ్ ఆఫర్ ను ప్రకటించారు.

డిజిటల్ ఇండియా సేల్ లో ఈ కామర్స్ దిగ్గజాలతో పోటీ
ఇక ఈనెల 22 నుంచి 26 తేదీల్లో ఐదు రోజులపాటు జరగనున్న ఈ సేల్ లో అదనంగా బెనిఫిట్స్ పొందాలనుకునేవారు రిలయన్స్ డిజిటల్స్, మై జియో స్టోర్లలో పొందవచ్చు. మొత్తానికి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ షాపింగ్ దిగ్గజాలు మాత్రమే కాకుండా, సందర్భాన్ని అందిపుచ్చుకునే పనిలో రిలయన్స్ కూడా ముందు వరుసలో ఉంది. అందులో భాగంగానే రిలయన్స్ డిజిటల్ కస్టమర్లకు డబల్ బెనిఫిట్ అందిస్తూ, అద్భుతమైన ఆఫర్లను ప్రకటిస్తూ డిజిటల్ ఇండియా సేల్ పేరుతో దూసుకుపోవడానికి ముందు వరుసలో నిలిచింది.