For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రభుత్వరంగ ఇంధన సంస్థలకు రిలయన్స్, BP దెబ్బ, లాభాలు తగ్గే అవకాశం

|

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని భారత అతి పెద్ద ఆయిల్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటన్‌కు చెందిన BPలు సంయుక్తంగా JIO-BP పేరుతో పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయనుండటంతో ప్రభుత్వరంగ చమురు విక్రయ సంస్థలపై భారీగా ప్రతికూల ప్రభావం పడుందని మోర్గాన్ స్టాన్లీ రీసెర్చ్‌లో తేలింది. ఈ మేరకు ఇది తన నివేదికను ఆదివారం వెల్లడించింది.

రిలయన్స్-ఆరామ్‌కో డీల్‌కు అడ్డుకట్ట!! ముఖేష్ అంబానీకి షాకిస్తున్నారా?రిలయన్స్-ఆరామ్‌కో డీల్‌కు అడ్డుకట్ట!! ముఖేష్ అంబానీకి షాకిస్తున్నారా?

ప్రభుత్వ చమురు సంస్థలకు దెబ్బ

ప్రభుత్వ చమురు సంస్థలకు దెబ్బ

బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంటుతో ఏర్పాటు చేయనున్న ఈ జాయింట్ వెంచర్లో BPకి 49% వాటా ఉండనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 51% ఉండనుంది. జాయింట్ వెంచర్లో 1,400 రిటైల్ పెట్రోల్ పంపుల్ని ఏర్పాటు చేయనున్నారు. రానున్న అయిదేళ్లలో ఈ సంఖ్యను 5,500కి పెంచనున్నట్లు కూడా ప్రకటించాయి. అయితే ప్రస్తుతం భారత్‌లో చమురు విక్రయాల్లో రెండింట మూడోవంతు ప్రభుత్వరంగ సంస్థలదే ఆధిపత్యం. ఇప్పుడు RIL - BP వల్ల వీటిపై భారీగా ప్రభావం పడనుంది.

సులభతరం

సులభతరం

రిఫైనరీ ఎగుమతులు సులభతరం కావడంతో దేశీయంగా మరింత శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులను విక్రయించడం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు దోహదపడుతుందని చెబుతున్నారు. జీయో - బీపీ బ్రాండ్ కింద రిటైల్ నెట్ వర్క్ ఉంటుంది. దేశీయ ఇంధన మార్కెట్లో పెరిగిన పోటీ, ఇంధన ధరలలో మార్పులు ఉపయోగపడతాయని అంటున్నారు.

రిటైల్ మార్జిన్లు తగ్గుతాయి..

రిటైల్ మార్జిన్లు తగ్గుతాయి..

పోటీ కారణంగా రిటైల్ ఇంధన మార్జిన్లు భారీగా పడిపోతాయని కూడా మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది. ఇది వినియోగదారులకు ప్రయోజనం కూడా అవుతుంది. RIL-BP ఇంధన స్టేషన్లు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటే 2025 నాటికి దాదాపు 8 శాతం పంప్ స్టేషన్లను దేశవ్యాప్తంగా కలిగి ఉంటాయని పేర్కొంది.

English summary

ప్రభుత్వరంగ ఇంధన సంస్థలకు రిలయన్స్, BP దెబ్బ, లాభాలు తగ్గే అవకాశం | Reliance and BP petrol pumps to dent PSU market share

India's biggest company Reliance Industries Ltd and UK's BP plc formalising plans to set up up petrol pumps under Jio-BP brand will impact market share of state-owned fuel retailers, Morgan Stanley said in a research report.
Story first published: Monday, December 23, 2019, 8:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X