రూ. కోటి ఫ్లాట్ విలువ ఇప్పుడు 90 లక్షలకు పడిపోయింది, త్వరలోనే రూ.50 లక్షలకు.. కారణం ఏంటంటే..
ప్రతి ఒక్కరూ తమ డబ్బును పెట్టుబడిగా పెట్టి దానికి ఆదాయం పొందాలని చూస్తుంటారు. అయితే ఈ పెట్టుబడి ఎక్కడ పెట్టాలనే దానిపై సరిగా క్లారిటీ ఉండదు. దీంతో చాలామంది తెలియని చోట పెట్టుబడి పెట్టి నష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. అయితే అందరూ పెట్టుబడి పెట్టే రంగాలు ప్రధానంగా రియల్ ఎస్టేట్, బంగారం.. అయితే ఇప్పుడు తాజాగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వైరల్ న్యూస్ ప్రకారం.. మీరు పెట్టిన పెట్టుబడి మీకు తెలియకుండానే దాని విలువ కోల్పోతుందని.. ఆర్ధిక శాస్త్రం మీద సరళమైన, బలమైన హెచ్చరిక ఇది.
ఉదాహరణకు మీ 2BHK ఫ్లాట్ విలువ ప్రస్తుతం రూ.1 కోటి అని అనుకోండి. వచ్చే ఏడాది అది రూ.90 లక్షలకు పడిపోతే ఎలా ఉంటుంది? అది ఊహకే అందడం లేదు కదా.. అయితే అది ఉహ కాదు నిజంగానే జరుగుతోంది. కానీ మీరు గమనించడం లేదని ఫైనాన్స్ ఎడ్యుకేటర్ అక్షత్ శ్రీవాస్తవ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. అయితే ఆయన చెబుతున్నది.. అసలు ఆస్తుల ధరలు తగ్గడం కాదని అది కరెన్సీ డివాల్యూషన్ వల్ల మన డబ్బు విలువ తగ్గిపోతుందని చెబుతున్నారు.

ఆయన చెప్పిన వివరాల ప్రకారం చూస్తే.. మన దగ్గర ఉన్న డబ్బు నేరుగా తగ్గకపోయినా దాని కొనుగోలు శక్తి పడిపోతుంది.మరి ఎందుకు ఇలా జరుగుతోందో ఎవరికైనా తెలుసా.. దీని కారణం ఏంటంటే.. ప్రభుత్వాలు అవలీలగా నోట్ల ముద్రణ చేస్తూ.. మార్కెట్‌లో డబ్బును పెంచుతున్నాయి.అదే సమయంలో దాని విలువను తగ్గిస్తున్నాయి. ఉదాహరణకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ కేవలం ఒక్క సంవత్సరంలో దేశ మొత్తం కరెన్సీ సరఫరాలో 20% కొత్తగా ముద్రించిందని అక్షత్ ఎక్స్ వేదికగా తెలిపారు. దీంతో డబ్బు విలువ పడిపోయిందన్నారు. మీ డిపాజిట్ రేట్ 6 శాతం ఉంటే..అదే సమయంలో ముడిపడి ఉన్న డబ్బు ముద్రణ రేటు 10శాతంగా ఉంది. దీంతో మీరు మీరు ప్రతి ఏడాది మీ డబ్బు విలువలో 4 శాతం కోల్పోతున్నారని తెలిపారు.
అయితే ఇది చాలా మందికి ఎందుకు అర్థం కావడం లేదనేది ప్రధానంగా ఉత్పన్నమయ్యే ప్రశ్న..దీనికి జవాబు ఏంటంటే.. ప్రజలెవరూ దీన్ని పట్టించుకోరు. వారిలో చాలా మందికి ఆర్థిక వ్యవస్థపై అంతగా ఆసక్తి ఉండదు, వారు ఎప్పుడూ క్రికెట్, రాజకీయాలతో బిజీగా ఉంటారని ఫైనాన్స్ ఎడ్యుకేటర్ అక్షత్ శ్రీవాస్తవ చెబుతున్నారు. అయితే దీనికి పరిష్కార మార్గం ఏంటనే దానిపై కూడా ఆయన క్లారిటీ ఇస్తున్నారు.
ఆయన చెప్పిన ప్రకారం.. ఇన్ఫ్లేషన్‌కు వ్యతిరేకంగా నిలబడగల ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. అవి ఏంటంటే.. స్టాక్ మార్కెట్, బంగారం, రియల్ ఎస్టేట్ వంటి రంగాలు.అయితే ఇక్కడ కూడా ఓ చిక్కు ఉంది. ఇవి కూడా సరైన సమయంలో కొనకపోతే చాలా నష్టపోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు 2021లో బిట్‌కాయిన్ ను గరిష్ఠ ధర వద్ద కొనుగోలు చేసి ఉంటే, మూడు సంవత్సరాలు గడిచినా మీ రాబడి 0 శాతంగా ఉండేది అని చెబుతున్నారు.
మరి ఏ సమయంలో పెట్టుబడి పెట్టాలి, ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి అనే దానిపై కూడా ఆయన చెబుతున్నారు. మీరు బెస్ట్ అసెట్ ఎంచుకోవడమే కాకుండా..ఎప్పుడు కొనాలి, ఎంత కొనాలి, ఎంత క్యాష్ నిల్వ ఉంచాలి, ఎప్పుడు లాభాలు తీసుకోవాలి అనే దానిపై కూడా పుల్లుగా క్లారిటీ ఉండాలని అంటున్నారు. ఈ విషయాలు చాలా మందికి తెలియదు, అందుకే వాళ్లు క్రమంగా డబ్బును కోల్పోతున్నారని తెలిపారు.
చివరగా ఆయన ఏమంటున్నారంటే.. ఆస్తిపై నమ్మకం పెట్టుకుని మిగతా వాటిని విస్మరిస్తే.. ప్రతి ఏడాదీ మీ సంపద వాస్తవ విలువలో తగ్గిపోతూనే ఉంటుంది. ఇది ఆర్ధిక శాస్త్రం మీద సరళమైన, బలమైన హెచ్చరిక. మీరు మీ డబ్బును నిజంగా దాచుకుంటున్నారా? లేక మీకు తెలియకుండానే దాన్ని కోల్పోతున్నారా అనేది ఇప్పుడు అందరూ ప్రశ్నించుకోవాలి.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.