పశ్చిమాసియా దేశాలు నివురుగప్పిన నిప్పులా భగ్గుమంటున్నాయి. దాడులతో అతలాకుతలం అవుతున్నాయి. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేసిన దాడులు మధ్యప్రాచ్యంలో తీవ్ర ఆందోళనలు రేపుతున్నాయి. ఇరాన్ అధ్యక్షుడిని మట్టుబెట్టిన అమెరికా సైన్యం కాబోయే అధ్యక్షుడిని కూడా ఏరి పారేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇక ఈ యుధ్దంపై ట్రంప్ కూడా కీలక ప్రకటన చేశారు. వారాల పాటు ఈ యుద్ధం కొనసాగే పరిస్థితి ఉంటుందని తెలిపారు. ఇరాన్ కూడా ఎటువంటి చర్చలకు తావు లేదని స్పష్టం చేసింది. దీంతో పశ్చిమాసియా అణుక్షణం దాడులతో దద్దరిల్లుతోంది. ఈ ప్రభావం మార్కెట్లపై విపరీతంగా కనిపిస్తోంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఉద్రికత్తల నడుమ భారత స్టాక్ మార్కెట్లలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. షేర్ మార్కెట్లో అస్థిరత పెరిగింది. పెట్టుబడిదారుల గుండెల్లో వణుకు పుడుతోంది. ఈ పరిస్థితుల్లో.. ఇండియా VIX (Volatility Index) గత రెండు ట్రేడింగ్ సెషన్లలో దాదాపు 50 శాతం పెరిగి 21.14 వద్ద గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ స్థాయి గతంలో వచ్చిన కోవిడ్-19 మొదటి వారం తరువాత అంటే.. కనీసం ఆరు సంవత్సరాల తర్వాత ఇది అత్యధిక స్థాయి.. గత 10 నెలల్లో కూడా ఇదే అత్యధిక స్థాయి అని చెప్పవచ్చు.

ఇండియా VIX అంటే (India Volatility Index): ఇండియా VIX అంటే భారత మార్కెట్లలో అనిశ్చితిని, భవిష్యత్ అస్థిరతలాన్ని సూచించే సూచిక అని చెప్పవచ్చు. VIX పెరిగితే, మార్కెట్లో అనిశ్చితి (uncertainty), భయం (fear) ఎక్కువగా ఉందని అర్థం.VIX తగ్గితే, మార్కెట్ స్థిరంగా (stable) ఉందని సూచిస్తుంది.ఇది NSE (National Stock Exchange) నిఫ్టీ 50 ఫ్యూచర్స్ ఆధారంగా లెక్కించబడుతుంది. పెట్టుబడిదారులు VIX ను మార్కెట్ రిస్క్‌ను అంచనా వేసుకోవడానికి ఉపయోగిస్తారు.
ఇండియా VIX పెరుగుదలకు ప్రధాన కారణం మధ్యప్రాచ్యంలో ఉధ్రిక్తత అని చెప్పవచ్చు. శనివారం అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై ఆకస్మిక దాడులు ప్రారంభించాయి. ఈ దాడుల్లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో సహా ప్రముఖ ఇరాన్ నాయకులు మరణించారు. అలాగే ఇరాన్ క్షిపణి, అణు, సైనిక స్థావరాలు లక్ష్యంగా యుద్ధం సాగుతోంది. ఇరాన్ ప్రతీకారం తీర్చుకోవడంతో యుద్ధం మరింత తీవ్రతరం అయింది. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను పెంచి, మార్కెట్లను ప్రతికూలంగా ప్రభావితం చేశాయి. భారత మార్కెట్లు కూడా దానికి అనుగుణంగా పడిపోయాయి. దీని ఫలితంగా VIX సూచికలో తీవ్ర పెరుగుదల కనిపించింది.
మార్చి 2వ తేదీన సోమవారం మార్కెట్ ప్రారంభం అయ్యిన వెంటనే ఇండియా VIX 19 నుంచి 25 శాతం పెరిగింది. సెలవు రోజు కారణంగా తర్వాతి రోజు మార్కెట్ మూసివేయబడింది. మార్చి 4వ తేదీ బుధవారం మార్కెట్ తిరిగి తెరిచినప్పుడు VIX 23.4 శాతం పెరిగింది. అంతే కాకుండా ప్రపంచ స్థాయిలో US VIX (CBOE VIX) కూడా 19 శాతినికి పైగా పెరిగింది. ఇది భయాన్ని, గ్లోబల్ అస్థిరతను సూచిస్తుంది. మధ్యప్రాచ్యంలో ముడి చమురు సరఫరాలపై యుద్ధ ప్రభావం కూడా VIX రేటింగ్ను రికార్డు స్థాయికి తీసుకెళ్ళింది.
మార్చి 4 బుధవారం నిఫ్టీ 2.2 శాతం పడిపోయి.. తర్వాత కొంత కోలుకొని 1.55 శాతం లేదా 385 పాయింట్లు తగ్గి 24,380 వద్ద ముగిసింది. BSE సెన్సెక్స్ 1,100 పాయింట్లకుపైగా పడిపోయి 79,116 వద్ద ముగిసింది. గత రెండు సెషన్లలో 16 లక్షల కోట్ల రూపాయలకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరైపోయింది. బ్యాంకులు, ఐటీ, ఆటో, వినియోగ వస్తువుల రంగాల్లో భారీ అమ్మకాలు సంభవించాయి.
నిపుణుల ప్రకారం.. VIX 20 కంటే ఎక్కువ పెరగడం అంటే మార్కెట్ అస్థిరత గణనీయంగా పెరిగిందని సూచిస్తుంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గేవరకు ఈ పదునైన పెరుగుదల తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. యుద్ధం ఎక్కువకాలం కొనసాగితే, చమురు ధరలు 100 డాలర్లకి చేరే అవకాశం ఉంది. ఇది భారతదేశం వంటి దిగుమతిదారుల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రాబోయే వారాల్లో భారత మార్కెట్ అస్థిరత కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications