For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రండి బాబు రండి .. ఆఫర్లు ప్రకటిస్తూ .. డిస్కౌంట్స్ ఇస్తూ రియల్టర్ల తిప్పలు

|

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది . గత కొంత కాలంగా ఒడిదుడుకుల ఊగిసలాటగా సాగుతున్న రియల్ ఎస్టేట్ రంగం కరోనాతో మరింత ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో తమ వద్ద విక్రయాలు కాకుండా ఉన్న ఫ్లాట్ లను, ఫ్లాట్ లను అమ్ముకునే పనిలో పడ్డాయి రియల్ ఎస్టేట్ కంపెనీలు. భారీగా రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ కరోనా మిగిల్చిన ఆర్థిక సంక్షోభం నుండి బయటపడే ప్రయత్నం చేస్తున్నాయి. రండి బాబూ రండి అంటూ కస్టమర్లను ఆహ్వానిస్తున్నాయి.

 బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీలు

బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీలు

ఇప్పటికే చాలా చోట్ల ముంబై, ఢిల్లీ, పూణే, కలకత్తా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాల్లో చాలామంది బిల్డర్లు తమ వెంచర్లలో ఫ్లాట్ బుక్ చేసుకునే వారికి స్టాంప్ డ్యూటీ మరియు జీఎస్టీ మినహాయింపు ఇస్తున్నారు. ఈ మినహాయింపు వల్ల లగ్జరీ వెంచర్ల లో ప్లాట్లు కొనేవారికి 10 నుండి 15 లక్షల రూపాయల వరకు ఆదా అవుతున్నట్లుగా తెలుస్తుంది. వచ్చే ఏడాది మార్చి వరకు స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఉంటుందని బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి పెద్దపెద్ద కంపెనీలే.

10 శాతం చెల్లించే స్కీమ్ .. గృహోపకరణాలు ఫ్రీ స్కీమ్

10 శాతం చెల్లించే స్కీమ్ .. గృహోపకరణాలు ఫ్రీ స్కీమ్

ముంబై , పుణే వంటి ప్రధాన నగరాల్లో 10:90 పథకానికి తెరతీశారు చాలామంది రియల్టర్లు. దీని ఉద్దేశం ఈ స్కీం కింద నిర్మాణంలో ఉన్న ఏ ప్రాజెక్టు అయినా సరే 10 శాతం డబ్బులు చెల్లించి బుక్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా 90 శాతం ప్రాజెక్టు పూర్తయి గృహప్రవేశ సమయంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి ఆఫర్లు మాత్రమే కాకుండా కొంతమంది బిల్డర్లు కార్ పార్కింగ్ ఫ్రీ , ఫుల్ గా ఫర్నిష్డ్ ఫ్లాట్స్, ఫ్రిజ్ లు గృహోపకరణ వస్తువులు, ఇలా బోలెడన్ని ఆఫర్లు ఇస్తున్నారు. కొంతమంది బిల్డర్లు అయితే మీ అద్దె ఆదాయానికి పూచీ మాదే అంటూ ప్రకటిస్తున్నారు.

అద్దె షూరిటీ స్కీమ్ .. వరంగల్ వంటి నగరాల్లోనూ ఆఫర్ల జోరు

అద్దె షూరిటీ స్కీమ్ .. వరంగల్ వంటి నగరాల్లోనూ ఆఫర్ల జోరు

ఏడాది వరకు నెలకు 25 వేల రూపాయల అది ఖచ్చితంగా వచ్చి తీరుతుందని, ఒకవేళ అలా రాకుంటే తామే చెల్లిస్తామని ప్రకటనలు చేస్తున్నారు.

ఇప్పుడు ఈ సంస్కృతి వరంగల్ వంటి నగరాలకు కూడా పాకింది. అపార్ట్మెంట్ లలో ఫ్లాట్ల అమ్మకాల కోసం వరంగల్ వంటి నగరాల్లో కూడా ఆకర్షణీయమైన ఆఫర్లను ఇస్తున్నారు. చాలావరకు అపార్ట్మెంట్లలో బిల్డర్ నిర్మించి ఇచ్చే ఎమినిటీస్ మాత్రమే కాకుండా, అదనంగా కస్టమర్ టేస్టుకు తగిన వసతులు కూడా పాత ధరల్లోనే ఇస్తున్న పరిస్థితి ఉంది.

వ్యాపారం పుంజుకోవటానికి రియల్టర్ల తిప్పలు

వ్యాపారం పుంజుకోవటానికి రియల్టర్ల తిప్పలు

బిజినెస్ సరిగా నడవక, పెట్టుబడికి ఇబ్బందిగా మారుతున్న తరుణంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించే వారిని సైతం చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఆహ్వానిస్తున్నాయి. పెట్టుబడుల్లో లాభాల లెక్కలు కూడా చెబుతున్నాయి. ఏది ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోవడం కోసం రియల్టర్లు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్ని కావు. కస్టమర్లను ఆకర్షించడానికి బంపర్ ఆఫర్ లను ప్రకటిస్తూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి.

English summary

రండి బాబు రండి .. ఆఫర్లు ప్రకటిస్తూ .. డిస్కౌంట్స్ ఇస్తూ రియల్టర్ల తిప్పలు | Realtors announcing offers .. giving discounts to customers

The real estate sector is down due to the corona virus epidemic. The real estate sector is facing more difficulties with Corona. As a result, real estate companies are selling their flats by giving discounts.
Story first published: Thursday, September 10, 2020, 19:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X