For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా ఎఫెక్ట్: ఎమర్జెన్సీ రేట్‌కట్‌కు ఆర్బీఐ దూరం, 43 దేశాలు యూఎస్ ఫెడ్ దారిలో..

|

ముంబై: కరోనా ప్రభావం నేపథ్యంలో వివిధ దేశాలు ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి. సోమవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మీడియా సమావేశానికి ముందు.. వడ్డీ రేట్ల తగ్గింపు కోసమేనని అందరూ భావించారు. కానీ యస్ బ్యాంకు, కరోనా వైరస్ ప్రభావం, తీసుకునే చర్యలపై ఆయన మాట్లాడారు. వడ్డీరేటు తగ్గింపు మాత్రం జరగలేదు. అయితే త్వరలో వడ్డీ రేట్లు తగ్గే అవకాశముంది.

కరోనా ఎఫెక్ట్: కొనాలా వద్దా.. బంగారం కొనుగోలుపై గందరగోళంకరోనా ఎఫెక్ట్: కొనాలా వద్దా.. బంగారం కొనుగోలుపై గందరగోళం

వడ్డీ రేట్లు తగ్గుతాయా?

వడ్డీ రేట్లు తగ్గుతాయా?

ప్రస్తుతం వడ్డీ రేట్లు తగ్గించనప్పటికీ త్వరలో తగ్గుతాయని ఆర్బీఐ గవర్నర్ సంకేతాలు ఇచ్చారు. మార్చి 31 నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు జరిగే మానిటరీ పాలసీ సమావేశం సమయంలో వడ్డీ రేట్లు దిగివచ్చే అవకాశాలు ఉన్నాయి. వడ్డీ రేట్ల తగ్గింపుపై ఓ విలేకరి ప్రశ్నించగా.. రేట్ కట్ సహా అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. వడ్డీ రేట్లు తగ్గించినా తగ్గించకపోయినా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్థిక వ్యవస్థకు పుష్కలంగా లిక్విడిటీ ఉందని చెప్పారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీ రేటు తగ్గించడం కష్టమేనని కొందరు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

వడ్డీ రేట్లు 0కు తగ్గిస్తూ యూఎస్ ఫెడ్ నిర్ణయం

వడ్డీ రేట్లు 0కు తగ్గిస్తూ యూఎస్ ఫెడ్ నిర్ణయం

అమెరికా కనిష్టస్థాయిలో 0.25 శాతంగా ఉన్న వడ్డీ రేటును సున్నా శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం అత్యవసరంగా భేటీ అయినా యూఎస్ ఫెడ్, కరోనా ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థను దిగజార్చుతోంది. ఈ నేపథ్యంలో యూఎస్ ఫెడ్ ఈ నిర్ణయం తీసుకుంది. 2008లో లీమన్ బ్రదర్స్ దివాళా తర్వాత ఏర్పడిన ఆర్థిక మాంద్యం నేపథ్యంలో అమెరికా వడ్డీ రేట్లను సున్నా శాతానికి మార్చాయి. ఇప్పుడు మరోసారి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇది తొలిసారి.

700 బిలియన్ డాలర్ల నిధులు

700 బిలియన్ డాలర్ల నిధులు

అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారకుండా 700 బిలియన్ డాలర్ల ట్రెజరీ నిధులను వెచ్చించనున్నట్లు ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమీ పావెల్ తెలిపారు. ఫెడ్ నిర్ణయంతో రిటైల్ ఇన్వెస్టర్లు హర్షం వ్యక్తం చేశారు. అయినప్పటికీ నాస్‌డాక్, డౌజోన్స్ ఫ్యూచర్స్ మాత్రం నష్టాల్లోనే ఉన్నాయి. అయితే నష్టాల శాతం తగ్గవచ్చునని అంచనా వేశారు.

న్యూజిలాండ్ వడ్డీ రేటు 0.25 శాతానికి తగ్గింపు

న్యూజిలాండ్ వడ్డీ రేటు 0.25 శాతానికి తగ్గింపు

న్యూజిలాండ్ కేంద్ర బ్యాంకు కూడా వడ్డీ రేట్లు తగ్గించింది. దీంతో బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. న్యూజిలాండ్ కేంద్ర బ్యాంకు వడ్డీ రేటును 1 శాతం నుండి 0.25 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కారణంగా న్యూజిలాండ్ ఎకానమీ తీవ్రంగా దెబ్బతిన్నది. ముఖ్యంగా టూరిజంపై భారీ ప్రభావం పడింది.

ఆస్ట్రేలియా, సౌత్ కొరియా దేశాలు కూడా..

ఆస్ట్రేలియా, సౌత్ కొరియా దేశాలు కూడా..

ఆస్ట్రేలియా కేంద్ర బ్యాంకు కూడా వడ్డీ రేట్లు తగ్గించింది. కరోనా దెబ్బతో దక్షిణ కొరియా కూడా వడ్డీ రేట్లు తగ్గించింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గత వారం వడ్డీ రేట్లు తగ్గించింది. కరోనా వైరస్ దెబ్బతో అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి.

వడ్డీ రేటు తగ్గించిన 43 దేశాలు

వడ్డీ రేటు తగ్గించిన 43 దేశాలు

కరోనా వైరస్ ప్రభావంతో ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా ఉండేందుకు ప్రపంచవ్యాప్తంగా 43 దేశాలు ఇప్పటి వరకు వడ్డీ రేట్లు తగ్గించాయి. ఇందులో ఈ నెలలోనే 20 బ్యాంకులు వడ్డీ రేటు తగ్గించడం గమనార్హం.

English summary

కరోనా ఎఫెక్ట్: ఎమర్జెన్సీ రేట్‌కట్‌కు ఆర్బీఐ దూరం, 43 దేశాలు యూఎస్ ఫెడ్ దారిలో.. | RBI stays away from emergency rate cut, Here some countries cuts rate

The Reserve Bank of India on Monday announced measures to ensure adequate liquidity in foreign exchange and money markets, even as it stayed away from an emergency interest rate cut.
Story first published: Wednesday, March 18, 2020, 8:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X