For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రుణాలు.. విదేశీ బ్యాంకులకు ఆర్బీఐ కొత్త నిబంధనల షాక్!

|

కరెంట్ ఖాతాకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ కొత్త మార్గదర్శకాలు విదేశీ బ్యాంకులను కలవరానికి గురిచేస్తున్నాయి. కరెంట్ ఖాతాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు విదేశీ బ్యాంకులకు ఇబ్బందికర పరిణామంగా మారింది. మెరుగైన సేవలు అందించే సాకుతో కార్పోరేట్ సంస్థల నుండి సున్నా వడ్డీకి డిపాజిట్లు సేకరించడం ఇకపై సాధ్యంకాదు.

<br><strong>గుడ్‌న్యూస్, లోన్ మారటోరియం రెండేళ్ల వరకు పొడిగించవచ్చు!</strong>
గుడ్‌న్యూస్, లోన్ మారటోరియం రెండేళ్ల వరకు పొడిగించవచ్చు!

విదేశీ బ్యాంకుల్లో ఖాతా.. దేశీయ బ్యాంకుల అప్పులు

విదేశీ బ్యాంకుల్లో ఖాతా.. దేశీయ బ్యాంకుల అప్పులు

ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం ఏదైనా కార్పోరేట్ సంస్థకు కరెంట్ ఖాతాను ఓపెన్ చేస్తే ఆ సంస్థకు రూ.50 కోట్లకు పైగా అప్పు ఉంటే అందులో కనీసం 10 శాతాన్ని కరెంట్ ఖాతా తెరిచిన బ్యాంకు ఇచ్చి ఉండాలి. విదేశీ బ్యాంకులు కంపెనీలకు ఎలాంటి అప్పు ఇవ్వకుండానే ఆ కంపెనీల కరెంట్ ఖాతాలు నిర్వహిస్తున్నాయి. కానీ ఆ కంపెనీలకు దేశీయ బ్యాంకులు అప్పులు ఇస్తున్నాయి.

డిపాజిట్లపై వడ్డీ చెల్లించకుండా..

డిపాజిట్లపై వడ్డీ చెల్లించకుండా..

కంపెనీలకు ఎలాంటి అప్పులు ఇవ్వకుండానే, డిపాజిట్లపై వడ్డీ చెల్లించకుండా దేశీయ కంపెనీలకు చెందిన పెద్ద మొత్తాలను మెరుగైన సేవలు అందించే పేరుతో విదేశీ బ్యాంకులు సమీకరిస్తున్నాయని ఓ బ్యాంకు అధికారి తెలిపారు. ఇప్పుడు దేశీయ బ్యాంకుల కంటే మెరుగైన సేవల పేరుతో కార్పోరేట్ సంస్థల నుండి జీరో వడ్డీ నిధులను పొందలేవని సీనియర్ బ్యాంకు అధికారి తెలిపారు.

ప్రభుత్వరంగ బ్యాంకులకు మేలు

ప్రభుత్వరంగ బ్యాంకులకు మేలు

ఆర్బీఐ కొత్త నిబంధనల కారణంగా ఈ పద్ధతికి ముగింపు పలికినట్లు అయిందని చెబుతున్నారు. దీంతో కార్పోరేట్ సంస్థలకు భారీగా రుణాలు ఇచ్చే ప్రభుత్వరంగ బ్యాంకులకు మేలు జరుగుతుందని అంటున్నారు. ఎందుకంటే విదేశీ బ్యాంకుల్లో రుణాలు ఇవ్వకుండానే తెరవడానికి వీలు లేకుండా పోతుంది.

English summary

రుణాలు.. విదేశీ బ్యాంకులకు ఆర్బీఐ కొత్త నిబంధనల షాక్! | RBI's new current account norms make foreign banks jitter

The Reserve Bank’s new guidelines on current account have made the foreign banks jittery, as they will not be able to garner nil-interest funds from corporate in the name of providing better services than their domestic counterparts, said a senior banker.
Story first published: Wednesday, September 2, 2020, 16:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X