కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్న కష్టకాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం (మార్చి 27) కీలక ప్రకటన చేసింది. సామాన్యుడికి ఊరట ఇచ్చింది. అన్ని రకాల టర్మ్ లోన్ల ఈఎంఐలపై మూడు నెలల పాటు మారటోరియం విధిస్తున్నట్లు తెలిపింది. దీంతో రుణాలు తీసుకున్న వారి క్రెడిట్ హిస్టరిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని తెలిపింది. నేడు ఆర్బీఐ మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. టర్మ్ లోన్ల ఈఎంఐలపై 3 నెలల మారటోరియం, రెపో రేటు 75 బేసిస్ పాయింట్లు తగ్గింపు రివర్స్ రెపో రేటు 90 బేసిస్ పాయింట్లు తగ్గింపు. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్, హెచ్‌ఎఫ్‌ఎస్‌లు అన్ని ఆర్థిక సంస్థల టర్మ్ లోన్‌లపై 3 నెలల మారటోరియం మంజూరు చేసింది ఆర్బీఐ.

ఈఎంఐ బ్యాంకులు అసలే కట్ చేసుకోవా?
తమ తమ కస్టమర్లకు మూడు నెలల పాటు ఈఎంఐపై మారటోరియం ఇచ్చేందుకు బ్యాంకులకు ఆర్బీఐ అనుమతిచ్చింది. అయితే దీనిని మీ బ్యాంకు అంగీకరించాల్సి ఉంటుంది. లేదంటే మీ అకౌంట్ నుండి మీ ఈఎంఐ డెబిట్ అవుతుంది. మీ ఈఎంఐకి సంబంధించి మీ మీ బ్యాంకుల బోర్డులు నిర్ణయం తీసుకుంటాయి. మీ బ్యాంకు బోర్డు అంగీకరించిన తర్వాత మారటోరియం వర్తిస్తుంది.

బ్యాంకు ఈఎంఐపై మారటోరియానికి ఓకే చెబితే..
ఒకవేళ బ్యాంకు మారటోరియానికి అంగీకరించి, మూడు నెలల పాటు ఈఎంఐ చెల్లింపులు చేయకుండా అంగీకరిస్తే అది క్రెడిట్ స్కోర్ పైన ప్రభావం చూపిస్తుందా? అనే ప్రశ్న చాలామందిలో ఉదయిస్తుంది. కానీ ప్రస్తుత కరోనా మహమ్మారి నేపథ్యంలో అనూహ్యంగా ఈ వెసులుబాటు ఇస్తున్నారు. దీని వల్ల క్రెడిట్ స్కోర్ పైన ఎలాంటి ప్రభావం పడదు.

ఏ ఆర్థిక సంస్థల నుండి ఈఎంఐ రిలీఫ్
అన్ని కమర్షియల్ బ్యాంకులలోను మారటోరియం ఊరట ఉంటుంది. రీజినల్ రూరల్ బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, కో ఆపరేటివ్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు తదితర ఆర్థిక సంస్థలు ఈఎంఐ చెల్లింపుల వాయిదా వేసుకోవచ్చు.

మారటోరియం తర్వాత..?
ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన అంశమేమంటే మారటోరియం అంటే రుణ మాఫీ కాదని గుర్తించాలి. మూడు నెలలు రుణమాఫీ కాదు. కేవలం కరోనా కారణంగా ఈ కాలంలో ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఎలాంటి వడ్డీ, అసలు చెల్లింపులు ఉంటున్నాయో అవే ఉంటాయి. ఇప్పుడు మూడు నెలలు మారటోరియం నేపథ్యంలో మూడు మీ రుణ కాల పరిమితి అంత మేరకు సర్దుబాటు చేసే వెసులుబాటు ఉంటుంది. అంటే మీ చెల్లింపు కాల పరిమితి మూడు నెలలు పెరుగుతుంది. ఈ మేరకు ఆర్బీఐ ఆదేశించింది.

ఏ రుణాలపై మారటోరియం?
అన్ని రకాల టర్మ్ లోన్లపై మారటోరియం వర్తిస్తుంది. పర్సనల్ లోన్లు, హోమ్ లోన్లు, ఆటో లోన్, ఎడ్యుకేషన్ లోన్ రుణాలపై వర్తిస్తుంది. అంతేకాదు, కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఏసీలు, ఫ్రిడ్జ్, మొబైల్ ఫోన్ల కోసం తీసుకున్న రుణాల కోసం కూడా ఇది వర్తిస్తుంది.

వడ్డీ, ప్రిన్సిపల్ అమౌంట్‌పై ఉపశమనం ఉంటుందా?
మార్చి 1, 2020 నాటికి బాకీ ఉన్న రుణాలపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వెసులుబాటు ఇస్తే ఈ మూడు నెలల కాలానికి ఎలాంటి చెల్లింపులు అవసరం లేదు. ఆ తర్వాత యథాతథంగా ఉంటుంది.

క్రెడిట్ కార్డు చెల్లింపులకు మారటోరియం వర్తిస్తుందా?
క్రెడిట్ కార్డులకు మాత్రం మారటోరియం వర్తించదు. ఇవి టర్మ్ లోన్ కిందకు రావు. అందువల్ల క్రెడిట్ కార్డు బిల్లును కచ్చితంగా చెల్లించాలి. లేదంటే భారీ పెనాల్టీలు కట్టవలసి ఉంటుంది. క్రెడిట్ కార్డులను రివాల్వింగ్ క్రెడిట్ కింద వర్గీకరించారు.

వ్యాపారులకు ఉపశమనం ఏమిటి?
వ్యాపార వర్గాలు తీసుకున్న వర్కింగ్ కేపిటల్ లోన్లుకు సంబంధించి వడ్డీ చెల్లింపులపై వాయిదాకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. మార్చి 1, 2020 నాటికి ఉన్న అన్ని రుణాలకు ఇది వర్తిస్తుంది. ఈ ఉపశమనం రుణ నిబంధనలు, షరతుల మార్పుగా భావించవద్దు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications