For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

RBI: నకిలీ నోట్ల విషయంలో బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ..

|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు సంచలన ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకుల్లో అసలు నకిలీ ఫేక్ నోట్ల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తాము సూచించిన ప్రమాణాలు పాటించాలని ఆదేశించింది. ప్రతి 3 నెలలకు నోట్లను ఒకసారి మెషీన్ లలో పరీక్షించాలని ఆర్బీఐ సూచించింది. 2016 నవంబర్ నెలలో కేంద్రం పెద్దనోట్లను రద్దు చేసినప్పటి నుంచి ఆర్బీఐ కొత్త రూ.200 రూ.500 రూ.2వేల నోట్ల సిరీస్ ను విడుదల చేసింది. అయితే కొత్త సిరీస్ నోట్లను ప్రవేశ పెట్టిన ఆర్బీఐ ప్రామాణీకరణ బ్యాంకుల్లో డబ్బులు లెక్కించే ఫిట్ నెస్ సార్టింగ్ మెషీన్ ల పనితీరును సమీక్షించాలని కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఫిట్ నోట్ లు వాస్తవంగా తగినంత శుభ్రంగా ఉండే నోటును చూడాలని.. రీసైక్లింగ్ కు అనుకూలంగా ఉందని పేర్కొంది. రీసైక్లింగ్ కు పనికొస్తాయా? లేదంటే ఆకరెన్సీ నోట్లను ఆర్బీఐ దశలవారీగా తొలగించి వాటి స్థానంలో కొత్త నోట్లను తయారు చేయించాలా? అన్నది బ్యాంకులు ఆర్బీఐకి సూచించాలని కోరింది. రీసైక్లింగ్ నోట్లను తప్పనిసరిగా వినియోగించాలని పేర్కొంది. లేదంటే రీసైక్లింగ్ చేయించాలని సూచించింది. మెషీన్స్ లలో ఫేక్ కరెన్సీ నోట్లు పనికిరాని నోట్లను గుర్తించి వాటిని వేరు చేయాలని సూచించింది.కరెన్సీ నోట్లను చెక్ చేసి ఆర్బీఐకి పంపించలని ఆదేశించింది.

 RBI revises norms on banknote authentication, sorting

ఇక చినిగిన నోట్లను నకిలీ నోట్లను అన్ ఫిట్ నోటు కేటగిరీ కింద ఉంచాలని పేర్కొంది. వీటిని బ్యాంకులు తప్పనిసరిగా అమలు చేయాలని ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇటీవలే దేశీయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం కోసం వడ్డీ రేట్లను పెంచింది. ఈ వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

2016-17లో ఏకంగా రూ.354.29 కోట్ల రూ.2వేల నోట్లను భారత రిజర్వ్ బ్యాంక్ ముద్రించింది. గత ఏడాది నుంచి పూర్తిగా రూ.2వేల నోట్ల ముద్రణను నిలిపివేసింది. బ్లాక్ మనీ కట్టడిలో భాగంగా ఈ చర్యలు తీసుకుంది. కరెన్సీ నోట్ల వివారాలపై ఆర్టీఐ కార్యకర్త జలగం సుధీర్ చేసిన దరఖాస్తుకు సమాధానంగా ఆర్బీఐ ఈ సమాధానం ఇచ్చింది.పెద్ద నోటు రూ.2వేల ముద్రణను పూర్తిగా ఆపేసిన కేంద్రం పూర్తిగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే రూ.500నోట్లను మాత్రం భారీగా ముద్రిస్తోంది. 2016-17తో పోలిస్తే గత ఏడాది ఏకంగా రెట్టింపు స్థాయిలో రూ.500 నోట్లను ప్రింటింగ్ చేసింది. ఇక రూ.10 50 100200 నోట్ల ప్రింటింగ్ ను ఆర్బీఐ తగ్గించింది. నాణేలు అందుబాటులోకి తేవడంతో రూ.1 2 5 నోట్లను పూర్తిగా ముద్రణ ఆపేసింది.

English summary

RBI: నకిలీ నోట్ల విషయంలో బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ.. | RBI revises norms on banknote authentication, sorting

The Reserve Bank of India (RBI) on Friday issued guidelines directing banks to test their banknote sorting machines on a quarterly basis.
Story first published: Sunday, July 3, 2022, 11:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X