For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిట్ కాయిన్ నిషేధం, RBI సొంత క్రిప్టోకరెన్సీ?

|

బిట్‌కాయిన్ వంటి ప్రయివేటు క్రిప్టోకరెన్సీకి చెక్ చెప్పి, సొంత క్రిప్టో కరెన్సీని తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుందా? అంటే వాదనలు వినిపిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)కి దాని రూపొందించే బాధ్యతలు అప్పగించనుందిని తెలుస్తోంది. దీనికి సంబంధించి బిల్లును ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరుగుతున్నాయి. మొత్తం 20 బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఇందులో క్రిప్టో కరెన్సీ నియంత్రణ, అధికారిక డిజిటల్ కరెన్సీ బిల్లును తీసుకురానుందట.

ది క్రిప్టో క‌రెన్సీ అండ్ రెగ్యులేష‌న్ ఆఫ్ అఫిసియ‌ల్ డిజిట‌ల్ క‌రెన్సీ బిల్లు, 2021 అనే పేరుతో కేంద్రం దీనిని తీసుకురానుంది. సార్వభౌమ డిజిట‌ల్ వెర్షన్ రూపాయిని అందుబాటులోకి తేనున్న‌ట్లు ఆర్బీఐ తెలిపింది. ఇటీవ‌లి కాలంలో ప్రయివేటు క్రిప్టో క‌రెన్సీకి డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆర్బీఐ తన నివేదికలో తెలిపింది.

RBI plans its own cryptocurrency, proposed crypto law may ban Bitcoins

ప్రయివేటు క్రిప్టో కరెన్సీ వినియోగం సరికాదని భావించిన ఆర్బీఐ, 2018లో దీనిని నిషేధించింది. అయితే, ఆర్బీఐ ఉత్తర్వులను సుప్రీం కోర్టు 2020లో కొట్టివేసింది. దీంతో చట్టాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందట. 2019లో కూడా ఇలాంటి క్రిప్టో కరెన్సీకి సంబంధించిన బిల్లును ప్రభుత్వం సిద్ధం చేసింది. క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేయడం, విక్రయించడాన్ని నేరంగా పరిగణిస్తూ పదేళ్ల జైలు శిక్ష విధించేలా డ్రాఫ్ట్ బిల్లును రూపొందించింది.

English summary

బిట్ కాయిన్ నిషేధం, RBI సొంత క్రిప్టోకరెన్సీ? | RBI plans its own cryptocurrency, proposed crypto law may ban Bitcoins

The government is likely to introduce a bill during Budget session 2021 that would ban private cryptocurrencies, including Bitcoin. The government aims to introduce an official digital currency that would be directly issued by the Reserve Bank of India. The bill to ban cryptocurrencies is among the 20 bills that the government wants to produce during the Union Budget, which will be presented on February 1.
Story first published: Sunday, January 31, 2021, 17:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X