For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎలాంటి నిబంధనలకు బందీ అయిలేదు: శక్తికాంతదాస్, వంటనూనెలపై ఏమన్నారంటే

|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పదేళ్ల కాలపరిమితి కలిగిన ప్రభుత్వ బాండ్స్ రాబడులు ఏడు శాతానికి చేరుకున్నట్లు వెల్లడించింది. జూన్ 2019 తర్వాత ఈ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. 6 నుండి 8 వరకు ఎంపీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశం నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ శుక్రవారం ఉదయం వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై ప్రభావం చూపే అవకాశముందని, ఈ నేపథ్యంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును 7.2 శాతానికి కుదించింది.

పెట్రో ధరల పెరుగుదల ద్రవ్యోల్భణం ఎదగడానికి కారణం కావొచ్చునని తెలిపింది. సమీప భవిష్యత్తులో వంట నూనెల ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదని తెలిపింది. వ్యవస్థలో రూ.8.5 లక్షల కోట్ల అదనపు ద్రవ్య లభ్యతను క్రమంగా దశలవారీగా ఆర్బీఐ ఉపసంహరించుకుంటుంది. ఆర్బీఐ ఎలాంటి నిబంధనలకు బంధీ అయి లేదని, భారత ఆర్థిక వ్యవస్థ రక్షణ కోసం అందుబాటులోని అన్ని సాధనాలను వినియోగిస్తాన్నారు దాస్.

RBI Monetary Policy: We are not hostage to any rule book, Das

కరోనా పరిస్థితుల నుడి ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోందని చెప్పారు. ఒమిక్రాన్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు ఆ ఆర్థిక వ్యవస్థ ఫలితాలను తుడిచి పెట్టాయన్నారు. ఆర్బీఐ వద్ద సరిపడా విదేశీ నిల్వలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటున 5.7 శాతం ద్రవ్యోల్భణం కొనసాగవచ్చునని అంచనా వేసింది. ఏప్రిల్-జూన్‌లో 6.3 శాతం, జూలై-సెప్టెంబర్‌లో 5 శాతం, అక్టోబర్-డిసెంబర్‌లో 5.4 శాతం, జనవరి-మార్చిలో 5.1 శాతంగా ఉండనున్నట్లు తెలిపింది.

English summary

ఎలాంటి నిబంధనలకు బందీ అయిలేదు: శక్తికాంతదాస్, వంటనూనెలపై ఏమన్నారంటే | RBI Monetary Policy: We are not hostage to any rule book, Das

The yield on the 10-year government bond hit 7 percent on April 8 for the first time since June 2019 after the Reserve Bank of India raised its annual inflation forecast during its bi-monthly monetary policy review.
Story first published: Friday, April 8, 2022, 11:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X