For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరెన్సీని గుర్తించేందుకు ఆర్బీఐ సరికొత్త యాప్ MANI, ఆఫ్‌లైన్‌లోనూ...

|

కంటిచూపు సరిగ్గాలేని వారు కరెన్సీ నోట్లను గుర్తించేందుకు వీలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సరికొత్త మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. మనీ (MANI) పేరుతో ఈ మొబైల్ అప్లికేషన్‌ను తీసుకు వచ్చింది. దీనిని బుధవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రారంభించారు. ఈ అప్లికేషన్ సాయంతో కంటిచూపు సరిగాలేని వారు సులువుగా నోట్లను గుర్తించేలా తయారు చేశారు.

రూ.25 లక్షల ఇన్సురెన్స్ సహా... 19న మరో తేజాస్ ఎక్స్‌ప్రెస్రూ.25 లక్షల ఇన్సురెన్స్ సహా... 19న మరో తేజాస్ ఎక్స్‌ప్రెస్

ఆఫ్‌లైన్‌లో కూడా పని చేస్తుంది

ఈ యాప్‌ను ఐవోఎస్ ఆపిల్ ప్లే స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ వంటి వాటి నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు దీనిని ఉచితంగానే డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ యాప్‌ను ఓసారి డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత ఆన్‌లైన్‌లో లేకపోయినా అంటే ఆఫ్‌లైన్‌లో ఉన్నా కూడా పని చేస్తుంది. రెండు సులభమైన స్టెప్పులలో కరెన్సీని గుర్తించవచ్చు.

హిందీలో లేదా ఇంగ్లీష్‌లో సమాధానం

ఈ యాప్ కెమెరా సాయంతో కరెన్సీ నోట్లను స్కాన్ చేసి హిందీ లేదా ఇంగ్లీష్ భాషల్లో సమాధానం ఇస్తుంది. భారత కరెన్సీకి అనేక ఫీచర్లు ఉంటాయని, అంధులు కూడా నోట్లను సులభంగా గుర్తించే విధంగా ఈ యాప్ రూపొందించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు.

కొత్త నోట్లు గుర్తించేలా..

కొత్త నోట్లు గుర్తించేలా..

ఆర్బీఐ మహాత్మాగాంధీ సిరీస్ పేరుతో సైజులు, డిజైన్లలో మార్పులు చేసి 2016 నవంబర్ నెలలో కొత్త నోట్లను అందుబాటులోకి తెచ్చింది. అందులో భాగంగా రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2,000 నోట్లను విడుదల చేసింది. ఈ కొత్త నోట్లను గుర్తించేందుకు అంధులకు ఇబ్బందిగా మారిందనే వాదనలు ఉన్నాయి. ఈ కొత్త యాప్ అంధులకు సులభంగా నోట్లను గుర్తించేలా ఉంటుంది.

English summary

కరెన్సీని గుర్తించేందుకు ఆర్బీఐ సరికొత్త యాప్ MANI, ఆఫ్‌లైన్‌లోనూ... | RBI launches mobile app MANI for visually challenged to identify currency notes

The Reserve Bank of India Governor Shaktikanta Das on Wednesday launched a mobile app to help visually-impaired people to identify the denomination of currency notes.
Story first published: Thursday, January 2, 2020, 7:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X