For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రెడిట్, డెబిట్ కార్డు జారీకి ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు, జూలై 1 నుండి...

|

కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కార్డుల జారీపై కొత్త గైడ్‌లైన్స్‌ను జారీ చేసింది. కస్టమర్ల అంగీకారం లేకుండా కొత్త కార్డులను జారీ చేయడం లేదా ఉన్న కార్డుల పరిమితిని పెంచడం వంటివి చేయవద్దని కార్డు జారీ చేసే సంస్థలకు తెలిపింది. ఆయాచిత కార్డులను జారీ చేసే సమయంలో, బిల్లుకు రెట్టింపు మొత్తాన్ని పెనాల్టీగా ఆయా సంస్థలు చెల్లించవలసి వస్తోందని హెచ్చరించింది. క్రెడిట్ కార్డు బిల్లుల వసూలు కోసం కస్టమర్లను ఎలాంటి ఒత్తిడి, వేధింపులకు గురి చేయవద్దని కార్డు సంస్థలు, థర్డ్ పార్టీ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది.

మార్గదర్శకాలు

మార్గదర్శకాలు

ఈ మేరకు ఆర్బీఐ గురువారం డెబిట్, క్రెడిట్ కార్డుల విషయానికి సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త నిబంధనలు జూలై 1వ తేదీ నుండి అమలులోకి వస్తున్నట్లు తెలిపింది. రూ.100 కోట్ల వ్యాల్యూ దాటిన కమర్షియల్ బ్యాంకులు సొంతగా లేదా కార్డు సంస్థలు/NBFCలతో కూడిన క్రెడిట్ కార్డులను జారీ చేయవచ్చునని తెలిపింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ముందుస్తు అనుమతి లేకుండా ఎలాంటి కార్డులను అందించవద్దని స్పష్టం చేసింది. కో-బ్రాండెడ్ కార్డులు అందించిన సంస్థలు ఆ కార్డులను తమ సొంత కార్డుగా ప్రకటించుకోవద్దని తెలిపింది. ఫిర్యాదులను స్వీకరించే కస్టమర్ సేవల సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని సూచించింది.

షరతులు, నిబందనలు

షరతులు, నిబందనలు

ఈ మార్గదర్శకాలు పేమెంట్ బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకులు మినహా అన్ని బ్యాంకులకు వర్తిస్తాయి. అన్ని ఎన్‌బీఎఫ్‌సీ బ్యాంకులు కూడా ఈ కొత్త నిబంధనలను అనుసరించాలి. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు డెబిట్ లేదా క్రెడిట్ కార్డు జారీ చేయడానికి ఆర్బీఐ అనుమతిస్తుంది.

క్రెడిట్ కార్డు అనేది ముందుగా ఆమోదించబడిన రివాల్వింగ్ క్రెడిట్ పరిమితితో జారీ చేయబడిన గుర్తింపు సాధనాన్ని కలిగి ఉన్న భౌతిక లేదా వర్చువల్ చెల్లింపు సాధనం. నిర్దేశించిన షరతులు, నిబంధనలకు లోబడి వస్తువులు లేదా సేవలను కొనుగోలు చేయడానికి లేదా నగదు అడ్వాన్స్ డ్రా చేయడానికి ఉపయోగించబడుతుంది.

స్వతంత్రంగా లేదా టై-అప్

స్వతంత్రంగా లేదా టై-అప్

రూ.100 కోట్లు అంతకంటే ఎక్కువ నికర వ్యాల్యూ కలిగిన రీజినల్ రూరల్ బ్యాంకులు కాకుండా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు క్రెడిట్ కార్డు వ్యాపారం కోసం ఇప్పుడు ఇండిపెండెంట్‌గా లేదా ఇతరులతో టై-అప్‌తో క్రెడిట్ కార్డు వ్యాపారం చేయవచ్చు. క్రెడిట్ కార్డు వ్యాపారం కోసం ఆర్బీఐ నుండి ముందస్తు అనుమతి ఉంటుంది. ఆర్బీఐ అనుమతి లేకుండా ఎన్బీఎఫ్‌సీలు క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు జారీ చేయరాదు.

English summary

క్రెడిట్, డెబిట్ కార్డు జారీకి ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు, జూలై 1 నుండి... | RBI issues new guidelines for credit, debit cards

The RBI has released master directions for credit and debit card issuance in the year 2022. These fresh guidelines will come into effect from July 1, 2022.
Story first published: Friday, April 22, 2022, 9:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X