For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కట్టు తప్పిన ఆ సహకార బ్యాంక్‌పై ఆర్బీఐ కొరడా: లిక్విడేటర్ అపాయింట్

|

ముంబై: కట్టు తప్పిన సహకార బ్యాంకులపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన చర్యలను తీసుకోవడంలో ఏ మాత్రం వెనుకాడట్లేదు. సహకార బ్యాంకుల్లో తమ నగదు మొత్తాలు, బంగారు ఆభరణాలను దాచుకునే డిపాజిటర్లకు రక్షణ కల్పించే విషయంలో రాజీ పడట్లేదు. తాము రూపొందించిన మార్గదర్శకాలు, నియమ నిబంధనలను ఉల్లంఘించిన కోఆపరేటివ్ బ్యాంకులపై కొరడా ఝుళిపిస్తోంది. వాటి లైసెన్సులను రద్దు చేస్తోంది. ఇదివరకు పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌ లైసెన్స్‌ను రద్దు చేసింది రిజర్వుబ్యాంక్. ఇక తాజాగా మరో సహకార బ్యాంక్‌ పైనా కన్నెర్ర చేసింది.

మహారాష్ట్రలోని పన్వెల్‌లో గల కర్నాల్ నగరి సహకారి బ్యాంక్ లిమిటెడ్ లావాదేవీలను రద్దు చేసింది రిజర్వు బ్యాంక్. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఆ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసింది. దీనితోపాటు- మహారాష్ట్ర కోఆపరేటివ్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ కమిషనర్‌కు ఓ సర్కులర్‌ను జారీ చేసింది. కర్నాల నగరి సహకారి బ్యాంక్ లావాదేవీలను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉత్తర్వులను జారీ చేయాలని సూచించింది. అలాగే- లిక్విడేటర్‌ను కూడా అపాయింట్ చేయాలని విజ్ఞప్తి చేసింది.

RBI has cancelled the licence of Karnala Nagari Sahakari Bank in Maharashtra, here is why?

కర్నాల నగరి సహకారి బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేయడానికి ప్రధాన కారణం- కేపిటల్ ఇన్వెస్ట్‌మెంట్. సహకార బ్యాంక్‌ను నడిపించడానికి అవసరమైన మూలధన పెట్టుబడులు చాలినన్ని లేకుండా కర్నాల నగరి తన కార్యకలాపాలను కొనసాగిస్తోందని పేర్కొంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 11 (1), సెక్షన్ 22 (3) (డీ) కింద బ్యాంక్ యాజమాన్యం నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలిపింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్‌లోని పలు సెక్షన్లను ఉల్లంఘించినట్లు గుర్తించామని స్పష్టం చేసింది. దీన్ని కొనసాగించడం వల్ల డిపాజిటర్లు నష్టపోతారనే కారణంతో- లైసెన్స్‌ను రద్దు చేయాల్సి వచ్చిందని రిజర్వుబ్యాంక్ వివరణ ఇచ్చింది.

రిజర్వు బ్యాంక్ ఇప్పటికే పంజాబ్ అండ్ మహారాష్ట్ర బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే. గురు రాఘవేంద్ర సహకార బ్యాంక్ పైనా ఆంక్షలను విధించింది. ఈ రెండు బ్యాంకులకు చెందిన ఖాతాదారులను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.. ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (అమెండ్‌మెంట్) యాక్ట్ పరిధిలోకి తీసుకొచ్చింది. మారటోరియం ద్వారా 90 రోజుల్లో వారికి అయిదు లక్షల రూపాయల మేర బెనిఫిట్ కల్పించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

English summary

కట్టు తప్పిన ఆ సహకార బ్యాంక్‌పై ఆర్బీఐ కొరడా: లిక్విడేటర్ అపాయింట్ | RBI has cancelled the licence of Karnala Nagari Sahakari Bank in Maharashtra, here is why?

The RBI has cancelled the licence of Karnala Nagari Sahakari Bank, Panvel in Maharashtra. The reason cited the absence of adequate capital and being unable to pay its present depositors in full.
Story first published: Saturday, August 14, 2021, 10:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X