For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

New card rules: కార్డు నిబంధనల గడువును పొడిగించిన ఆర్బీఐ

|

కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్రెడిట్ లేదా డెబిట్ కార్డు యాక్టివేషన్ కోసం తెచ్చిన వివిధ నిబంధనల అమలు కోసం బ్యాంకులకు, బ్యాంకింగేంతర ఆర్థిక సంస్థలకు మూడు నెలల గడువును ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం వెల్లడించింది. ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్ల నుండి, ఇతరుల నుండి పలుమార్లు విజ్ఞప్తులు వచ్చాయని, వీటి అమలుకు కాస్త సమయం కావాలని కోరిందని, అందుకే అక్టోబర్ 1, 2022 వరకు గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది.

క‌స్ట‌మ‌ర్ల ఆమోదం లేకుండా క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్స్ యాక్టివేష‌న్ చేయ‌రాదు. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ జారీ-నిర్వాహ‌క మార్గ‌ద‌ర్శ‌కాలు - 2022 పేరిట బ్యాంకులు, NBFCలకు మాస్ట‌ర్ డైరెక్ష‌న్‌ను జారీ చేసింది కేంద్రబ్యాంకు. షెడ్యూల్ ప్ర‌కారం జూలై 1వ తేదీ నుండి ఈ నిబంధనలకు అమలులోకి రావాలి. అయితే ఈ విష‌య‌మై ప‌రిశ్ర‌మ‌లోని వివిధ వాటాదారులు ఆర్బీఐని సంప్ర‌దించి స‌మ‌యాన్ని పొడిగించాల‌ని కోరడంతో నిబంధ‌న‌ల అమ‌ల‌ను అక్టోబ‌ర్ ఒకటో తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

RBI extends deadline to comply with new card rules

క్రెడిట్ కార్డు జారీ చేసిన తర్వాత ముప్పై రోజులు దాటినా కస్టమర్ యాక్టివేట్ చేయకున్నా, క్రెడిట్ కార్డు యాక్టివేషన్ కోసం కార్డుదారుడి నుండి బ్యాంకులు వన్ టైమ్ పాస్ వర్డ్‌ను తప్పనిసరిగా కోరాలని ఆ సర్క్యులర్‌లో ఉంది.

English summary

New card rules: కార్డు నిబంధనల గడువును పొడిగించిన ఆర్బీఐ | RBI extends deadline to comply with new card rules

The RBI on Tuesday granted a three-month extension for the implementation of certain provisions entailed as part of the credit and debit card issuance and conduct guidelines.
Story first published: Wednesday, June 22, 2022, 9:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X