For Daily Alerts
HDFC బ్యాంకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ నిలిపివేయండి, షాకిచ్చిన ఆర్బీఐ, ఎందుకంటే
|
న్యూఢిల్లీ: ప్రయివేటురంగం దిగ్గజం HDFC బ్యాంకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకుకు చెందిన డేటా సెంటర్‌లో గత నెల చోటు చేసుకున్న అంతరాయం నేపథ్యంలో ఈ చర్యలను తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఆదేశాలతో బ్యాంకు కొత్త క్రెడిట్ కార్డుల జారీకి బ్రేక్ పడింది.

గత రెండేళ్లుగా హెచ్‌డీఎఫ్‌సీకి సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, చెల్లింపులు తదితర కార్యకలాపాల్లో అంతరాయాలు చోటు చేసుకుంటున్నాయి. నవంబర్ 21న బ్యాంకు ప్రైమరీ డేటా సెంటర్లో విద్యుత్ సరఫరా నిలిచి, ఇంటర్నెట్ బ్యాంకింగ్, చెల్లింపుల్లో ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
English summary