For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Rakesh Jhunjhunwala: రూ.కోట్లు కురిపించిన ఆ అయిదు స్టాక్స్ ఇవే

|

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్‌లో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పేరు తెలియని వారు బహుశా ఎవరూ ఉండకపోవచ్చు. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కోట్ల రూపాయలను సంపాదించారాయన. స్టార్ ఇన్వెస్టర్‌గా, బిగ్‌బుల్‌గా గుర్తింపు ఉంది. షేర్ మార్కెట్‌లో ఆయన వేసే అంచనాలు 99 శాతం ఖచ్చితత్వంతో కూడుకుని ఉంటాయని చెబుతుంటాయి మార్కెట్ వర్గాలు. షేర్ల భవిష్యత్ ఎలా ఉండబోతోందనే విషయాన్ని ముందే అంచనా వేసి, ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఆయన ఇలా ఇన్వెస్ట్ చేసిన పోర్ట్‌ఫోలియోలు లాభాల బాటలో పరుగులు పెట్టాయి.

మళ్లీ వంటగ్యాస్ ధరల పెంపు: కత్తినూరుతున్న ఆయిల్ కంపెనీలు: 1 నుంచిమళ్లీ వంటగ్యాస్ ధరల పెంపు: కత్తినూరుతున్న ఆయిల్ కంపెనీలు: 1 నుంచి

టాటా మోటార్స్‌లో..

టాటా మోటార్స్‌లో..

టాటా గ్రూప్స్‌కు చెందిన టాటా మోటార్స్, ఇండియన్ హోటల్స్, రేటింగ్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ క్రిసిల్, డెల్టా కార్పొరేషన్ వంటి స్టాక్స్‌లో రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. గత ఏడాది టాటా మోటార్స్‌ ఆయనకు 17.82 కోట్ల రూపాయలను ఆర్జించి పెట్టింది. ఇందులో రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు 3.67 కోట్ల షేర్లు ఉన్నాయి. శుక్రవారం బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో టాటా మోటార్స్ షేర్లు రూ.9.55 పైసల మేర లాభపడ్డాయి. రూ.430.20 పైసల వద్ద ట్రేడింగ్ అయ్యాయి. ఏడాదిలో 34.96 శాతం మేర వీటి రేట్లు పెరిగాయి.

 ఇండియా హోటల్స్ షేర్లు..

ఇండియా హోటల్స్ షేర్లు..

ఇండియన్ హోటల్స్ షేర్ల వల్ల రాకేష్ ఝున్‌ఝున్‌వాలా 31.13 కోట్ల రూపాయలను అదనంగా ఆర్జించారు. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి స్టాక్ ఎక్స్ఛేంజీల్లో రూ.225.60 పైసలు పలికింది. రూ.5.20 పైసల మేర దీని వేల్యూ పెరిగింది. ఏడాది కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ షేర్ల ధర 67 శాతం పెరిగింది. అలాగే క్రిసిల్ షేర్లు కూడా. ఇందులో ఆయనకు 39.75 శాతం ఈక్విటీ షేర్లు ఉన్నాయి. వాటి ద్వారా బిగ్‌బుల్‌కు వచ్చిన ఆదాయం 21.72 కోట్ల రూపాయలు. మొత్తంగా క్రిసిల్ షేర్ ధర కిందటి రోజు 3,599 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. ఏడాది కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే 85.64 శాతం వీటి రేట్లు పెరిగాయి.

 ఎస్కార్ట్..

ఎస్కార్ట్..

ఇక ఎస్కార్ట్స్ కంపెనీ షేర్లు కూడా బిగ్ బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు కోట్ల రూపాయలను సంపాదించి పెట్టాయి. దీని స్టాక్ ప్రైస్ 1.05 శాతం మేర పెరిగింది. కిందటి రోజు 1,626.30 పైసల వద్ద దీని ట్రేడింగ్ ముగిసింది. ఆరు నెలలుగా ఈ కంపెనీ షేర్ల విలువ కాస్త తగ్గుతూ వచ్చినప్పటికీ.. వాటన్నింటినీ అధిగమించేలా ఇప్పుడు లాభాల్లో కొనసాగుతోంది. ఏడాది కాలాన్ని లెక్కలోకి తీసుకుంటే ఒక్కో షేర్ మీద 451 రూపాయల ప్రాఫిట్‌ను ఇచ్చింది.

English summary

Rakesh Jhunjhunwala: రూ.కోట్లు కురిపించిన ఆ అయిదు స్టాక్స్ ఇవే | Rakesh Jhunjhunwala made Crores of Rupees from these 5 stocks

Ace investor Rakesh Jhunjhunwala made Crores of Rupees from five of his portfolio stocks.
Story first published: Saturday, May 28, 2022, 17:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X