For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐపీఓకు టాప్ క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీస్: సెబి వద్ద డాక్యుమెంట్స్ ఫైల్

|

ముంబై: క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీస్ సెగ్మెంట్‌కు చెందిన దేశీయ టాప్ కంపెనీ త్వరలో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌ను జారీ చేయనుంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను సెక్యూరిటీ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు సమర్పించింది. రేడియంట్ క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ ఇది. ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ యాస్కెండ్ క్యాపిటల్స్ గ్రూప్ కంపెనీల్లో ఒకటి. పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా నిధులను సేకరించడానికి సెబి వద్ద రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ని దాఖలు చేసింది.

ఐపీఓ ద్వారా 60 కోట్ల విలువైన షేర్లును జారీ చేయనుంది. దీనితో పాటు ఆ కంపెనీకి చెందిన ప్రస్తుత ప్రమోటర్లు, వాటాదారుల ద్వారా 30.13 మిలియన్ షేర్లను విక్రయించాలని నిర్ణయించింది. యాస్కెంట్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఇండియా 37.21 శాతం వాటాను కలిగి ఉంది ఈ కంపెనీలో. మొత్తంగా 3 కోట్ల 76 లక్షల ఈక్విటీ షేర్లను రేడియంట క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌లో ఉన్నాయి. పబ్లిక్ ఇష్యూను జారీ చేయడం ద్వారా సమీకరించిన మొత్తంలో 21.23 కోట్ల రూపాయలను వర్కింగ్ కేపిటల్ అవసరాలకు నిధుల కోసం వినియోగించాలనే ప్రతిపాదనలు ఉన్నట్లు సెబికి అందజేసిన డాక్యుమెంట్లలో పొందుపరిచింది.

Radiant Cash Management Services has filed a draft red herring prospectus with the SEBI for IPO

ఈ ఏడాది ఆగస్టు నాటికి ఫండ్-బేస్డ్ బకాయిలు 21.42 కోట్ల రూపాయలు, నాన్ ఫండ్ బేస్డ్ వర్కింగ్ కేపిటల్ కోసం 21.02 కోట్ల రూపాయలుగా వేల్యుయేషన్ చేసినట్లు తెలిపింది. క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ సెగ్మెంట్‌కు చెందిన కంపెనీ కావడం వల్ల రేడియంట్ సంస్థ యాజమాన్యం ప్రతిరోజూ సుమారు 400 కోట్ల నగదును హ్యాండిల్ చేస్తుంటుంది. యాక్సిస్ బ్యాంక్, సిటీబ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, స్టాండర్డ్ ఛార్టెడ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్, యస్ బ్యాంక్ ఈ కంపెనీ క్లయింట్లుగా ఉంటున్నాయి.

క్యాష్ పికప్ అండ్ డెలివరి, నెట్‌వర్క్ కరెన్సీ మేనేజ్‌మెంట్, క్యాష్ ప్రాసెసింగ్, క్యాష్ వ్యాన్స్ అండ్ క్యాష్ ట్రాన్సిట్ వంటివి వాల్యూ యాడెడ్ సర్వీసులుగా ఉంటున్నాయి. ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్, యస్ సెక్యూరిటీలు ఈ ఇష్యూకి లీడ్ మేనేజర్స్‌గా వ్యవహరించనున్నాయి. 2005లో కల్నల్ డేవిడ్ దేవసహాయం దీన్ి నెలకొల్పాలరు. రిటైల్ క్యాష్ మేనేజ్‌మెంట్ సెగ్మెంట్‌లో ఇంటిగ్రేటెడ్ క్యాష్ లాజిస్టిక్ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది.

English summary

ఐపీఓకు టాప్ క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీస్: సెబి వద్ద డాక్యుమెంట్స్ ఫైల్ | Radiant Cash Management Services has filed a draft red herring prospectus with the SEBI for IPO

Radiant Cash Management Services Ltd has filed a draft red herring prospectus with the Securities and Exchange Board of India to raise funds via an initial public offering.
Story first published: Saturday, October 9, 2021, 19:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X