కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో రోడీ, కపడా, మకాన్, ఇంటర్నెట్ (ఆహారం, దుస్తులు, ఇల్లు, ఇంటర్నెట్) వంటి అవసరాలకు విలువ పెరిగిందని HDFC చైర్మన్ దీపక్ పరేఖ్ అన్నారు. ఎక్కువ మంది ప్రజలు ఇప్పుడు సొంతిల్లు కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. గతంలో కంటే ఇంటి మక్కువ పెరిగిందని అభిప్రాయపడ్డారు. ఆయన హెచ్‌డీఎఫ్‌సీ వాటాదారులకు రాసిన వార్షిక లేఖలో వివిధ అంశాలు పేర్కొన్నారు.

రియల్ ఎస్టేట్‌కు ఉద్దీపన కాదు..
ఆన్ లైన్ ద్వారా గృహాల రుణాల ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలుగా నిబంధనలు వెంటనే మార్చాలని దీపక్ పరేఖ్ అన్నారు. స్థిరాస్తి రుణాలకు ఒకేసారి పునర్ వ్యవస్థీకరణ, విదేశీ వాణిజ్య రుణాల నిబంధనలను సరళతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అసాధారణ పరిస్థితులు ఉన్నాయని, రియల్ ఎస్టేట్ రంగంలో బెయిలవుట్ ప్యాకేజీలు కాకుండా ఆర్థిక ఒత్తిడిని తొలగించే ఆచరణాత్మక విధానం అవసరమన్నారు.

ఆర్బీఐ చాలా భారం మోసింది..
సమస్యను వదిలేస్తే నిరర్థక ఆస్తులు పెరిగే ప్రమాదం ఉందని పరేఖ్ ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే ఆర్థికరంగాన్ని బలహీనపరుస్తుందన్నారు. ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూను ప్రతిబింబించేలా స్థిరాస్థి దరలు ఉండాలన్నారు. డెవలపర్స్ వద్ద ఉన్న ప్లాట్స్‌ను విక్రయించి, నగదు నిల్వలు పెంచుకోవడానికి ఇది దోహదపడుతుందన్నారు.

సుప్రీం కోర్టు ప్రశ్నించడం దురదృష్టకరం
ఆర్థిక స్థిరత్వాన్ని నిలబెట్టడంలో ఆర్బీఐ చాలా భారం మోసిందని దీపక్ పరేఖ్ ప్రశంసించారు. ఈఎంఐ మారటోరియానికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించడం బాధాకరం అభిప్రాయపడ్డారు. ఆర్థిక రంగం పని చేసే ప్రాథమిక సూత్రాలపై పని చేసే కేంద్ర బ్యాంకు సమాధానం చెప్పాల్సి వస్తోందన్నారు. కరోనా నేపథ్యంలో మారటోరియం కాలంలో వడ్డీ వసూలుపై సుప్రీంకోర్టు ఆర్బీఐని ప్రశ్నించిన విషయం తెలిసిందే. రుణాలు, వడ్డీ చెల్లింపులపై ఒప్పంద బాధ్యతలు, చట్టాలను ఉల్లంఘించలేదన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications