For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పబ్‌జీ ప్లేయర్స్‌కు గుడ్‌న్యూస్, ముఖేష్ అంబానీ చేతికి?

|

మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్ పబ్‌జీ భారత్‌లో నిషేధాన్ని ఎదుర్కొంటోంది. పబ్‌జీ అభిమానులకు ఇప్పుడు శుభవార్త! త్వరలో పబ్‌జీ రిలయన్స్ జియో గేమ్ కావొచ్చు. దక్షిణ కొరియా సంస్థ యూనిట్ పబ్‌జీ భారత్‌లో తిరిగి కార్యకలాపాలు కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోతో జట్టు కట్టవచ్చునని తెలుస్తోంది.

గేమింగ్ మేజర్.. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దేశంలో బాగా ప్రాచుర్యం పొందిన మల్టీప్లేయర్ గేమ్ భారత మార్కెట్లో ప్రస్తుతం నిషేధంలో ఉంది. రెండు సంస్థల మధ్య చర్చలు ఆదాయ భాగస్వామ్యం, స్థానికీకరణపై చర్చలు జరుగుతన్నాయని తెలుస్తోంది. పబ్‌జీ, రిలయన్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అక్టోబర్ 1 నుండి టీవీల ధరలు పెరుగుతున్నాయ్! రూ.1,500 వరకు పెంపు?అక్టోబర్ 1 నుండి టీవీల ధరలు పెరుగుతున్నాయ్! రూ.1,500 వరకు పెంపు?

మార్కెట్‌ను నిలబెట్టుకోవడానికి..

మార్కెట్‌ను నిలబెట్టుకోవడానికి..

కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్కెట్లు కుప్పకూలి, మార్కెట్ క్యాపిటలైజేషన్ పడిపోయిన సమయంలో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్‌లోకి భారీగా పెట్టుబడులు వచ్చాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ భారీగా పెరిగింది. రిలయన్స్ పెట్టుబడుల సమీకరణ చేయడంతో పాటు వివిధ రంగాల్లో పెట్టుబడులు కూడా పెడుతోంది. ఇందులో భాగంగా రిలయన్స్ సంస్థతో పెట్టుబడి భాగస్వామ్యం, స్థానికీకరణ, లీగల్ అంశాలపై చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. భారత్‌లో మార్కెట్‌ను కోల్పోకూడదని పబ్‌జీ భావిస్తోంది. ఇందులో భాగంగా ముఖేష్ అంబానీ కంపెనీతో చర్చలు జరుపుతోంది.

గేమింగ్ బిగ్గెస్ట్..

గేమింగ్ బిగ్గెస్ట్..

రిలయన్స్ జియో, పబ్‌జీ పరస్పర ప్రయోజనంతో ముందుకు సాగే అవకాశం ఉంది. పబ్‌జీ భారత్‌లో తక్కువ సమయంలో పెద్ద మార్కెట్‌ను దక్కించుకుంది. మరోవైపు రిలయన్స్ ఆన్‌లైన్ గేమింగ్ మార్కెట్ పైన ప్రధానంగా దృష్టి సారించింది. దేశంలో అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ మీడియం ఆన్‌లైన్ గేమింగ్ అని ముఖేష్ అంబానీ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అన్నారు. దేశంలో గేమింగ్ సామర్థ్యం భారీగా పెరగనుందన్నారు. మ్యూజిక్, మూవీస్, టెలివిజన్ షోల కంటే గేమింగ్ పెద్దదిగా ఉంటుందని చెప్పారు.

గేమింగ్ ఇండస్ట్రీ..

గేమింగ్ ఇండస్ట్రీ..

గేమింగ్ ఇండస్ట్రీ ఇప్పుడు ప్రారంభదశలో ఉన్నప్పటికీ భారతదేశంలో పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య నేపథ్యంలో గేమింగ్ కూడా పెరుగుతుందని, ఇది భారీ వృద్ధిని నమోదు చేస్తుందని ముఖేష్ అంబానీ అన్నారు. జియో ఫైబర్ సెట్ టాప్ బాక్స్ గేమింగ్ వంటి వాటిని సపోర్ట్ చేస్తుందని రిలయన్స్ జియో 2019లో ప్రకటించింది. గేమింగ్ పైన దృష్టి సారిస్తున్న రిలయన్స్, ఇప్పటికే భారీ మార్కెట్ కలిగి ఉన్న పబ్‌జీ త్వరలో భాగస్వామ్య ప్రకటన చేయవచ్చునని అంటున్నారు.

English summary

పబ్‌జీ ప్లేయర్స్‌కు గుడ్‌న్యూస్, ముఖేష్ అంబానీ చేతికి? | PUBG can team up with reliance jio to resume

It may be happy days reunion for PUBG players and fans in India dealing with the ban on the multi-player action game as it may soon be a Reliance Jio game. PUBG Corporation, the unit of a South Korean company behind PlayerUnknown's Battlegrounds (PUBG), may team up with Mukesh Ambani led Reliance Jio to resume operations in India.
Story first published: Monday, September 21, 2020, 16:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X