For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

14వ రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: వివిధ నగరాల్లో ధరలు..

|

పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (జూన్ 20) వరుసగా 14వ రోజు పెరిగాయి. జూన్ 7వ తేదీ నుండి వరుసగా ధరలు పెరగడంతో ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్ పైన రూ.7.62, లీటర్ డీజిల్ పైన రూ.8.28 పెరిగింది. ఈ రోజు (శనివారం) పెట్రోల్ లీటర్ పైన 51 పైసలు, డీజిల్ పైన 61 పైసలు పెరిగింది. కరోనా-లాక్ డౌన్ కారణంగా దాదాపు మూడు నెలల పాటు ధరలను సమీక్షించలేదు. జూన్ 7వ తేదీ నుండి సమీక్షిస్తున్న కంపెనీలు ప్రతి రోజు పెంచుతున్నాయి.

అలా చేస్తే పక్షపాతమే: అంగీకరించిన సుందర్ పిచాయ్, గూగుల్ కీలక నిర్ణయంఅలా చేస్తే పక్షపాతమే: అంగీకరించిన సుందర్ పిచాయ్, గూగుల్ కీలక నిర్ణయం

తాజా పెరుగుదలతో లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.78.88, లీటర్ డీజిల్ రూ.77.67కు చేరుకుంది. ముంబైలో పెట్రోల్ రూ.85.72, డీజిల్ రూ.75.54కు చేరుకుంది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.8188 (52 పైసలు పెరుగుదల), డీజిల్ రూ.75.91 (60 పైసలు పెరుగుదల), అమరావతిలో పెట్రోల్ రూ.82.27, డీజిల్ రూ.76.30, విజయవాడలో రూ.81.87, డీజిల్ రూ.75.94 పెరిగింది.

Prices hiked for 14th straight day, petrol price up by Rs 0.51, diesel by Rs 0.61

చెన్నైలో పెట్రోల్ రూ.82.27 (45 పైసలు పెరుగుదల), డీజిల్ రూ.75.29 (52 పైసలు పెరుగుదల), నోయిడాలో పెట్రోల్ రూ.79.90, డీజిల్ రూ.70.33, బెంగళూరు, గురుగ్రామ్‌లలో వరుసగా పెట్రోల్ రూ.81.44, రూ.77.14, డీజిల్ రూ.73.86, రూ.70.20గా ఉంది. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరిగాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 1.31 శాతం పెరిగి రూ.39.35, బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ 1.23 శాతం పెరిగి 42.02కు చేరుకుంది.

English summary

14వ రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: వివిధ నగరాల్లో ధరలు.. | Prices hiked for 14th straight day, petrol price up by Rs 0.51, diesel by Rs 0.61

Fuel prices have once again been hiked on Saturday, making this is the 14th straight day of rise in prices of petrol and diesel. Petrol prices in Delhi have been hiked by Rs 0.51 per litre while diesel prices have been hiked by Rs 0.61 per litre.
Story first published: Saturday, June 20, 2020, 9:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X