For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.1000 లోపు హోటల్ గదిపై 12% జీఎస్టీ, వీటిలో మినహాయింపులు రద్దు

|

కొన్ని వస్తువులు, సేవలపై పన్ను రేట్లలో మార్పుకు జీఎస్టీ మండలి మంగళవారం (జూన్ 28) ఆమోదం తెలిపింది. మాంసం, చేపలు, పెరుగు, పన్నీరు, తేనె వంటి ప్రీ-ప్యాకేజ్డ్, లేబుల్డ్ ఫుడ్‌పై జీఎస్టీ విధించనున్నారు. చెక్స్ జారీకి బ్యాంకులు వసూలు చేసే ఛార్జీలపై పన్ను విధిస్తారు. అంతర్రాష్ట్ర పరిధిలో జరిగే బంగారం, విలువైన రాళ్లను ట్రాన్సుపోర్ట్ చేయడానికి రాష్ట్రాలు ఈ-వే బిల్స్ జారీ చేయడానికి అనుమతి ఇచ్చారు. పన్ను ఆదాయాల్లో మరింత వాటాను రాష్ట్రాలు కోరుతున్నాయి. దీంతో జీఎస్టీ మండలి ఈ దిశగా నిర్ణయాలను తీసుకున్నది.

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలను తీసుకున్నది. రూ.1000 లోపు అద్దె ఉండే హోటల్ వసతిపై ఇక నుండి 12 శాతం జీఎస్టీ విధిస్తారు. ఇప్పటి వరకు దీనిపై జీఎస్టీ మినహాయింపు ఉంది. కానీ మంత్రుల బృందం 12 శాతం జీఎస్టీ విధించాలని ప్రతిపాదించగా, ఆమోదించింది.
క్యాసినో, ఆన్ లైన్ గేమింగ్, హార్స్ రైడింగ్ పైన 28 శాతం జీఎస్టీ విధించాలనే ప్రతిపాదనపై నేడు (బుధవారం) చర్చిస్తారు.
పోస్ట్ కార్డులు, ఇన్‌లాండ్ లెటర్స్, బుక్ పోస్ట్, ఎన్వలప్స్ మినహా అన్ని పోస్టల్ సేవలపై జీఎస్టీ ఛార్జ్ చేయనున్నారు.
వ్యాపార సంస్థలకు ఉండే నివాస సముదాయాల అద్దెలకు ఇచ్చే పన్ను మినహాయింపు తొలగనుంది.

Pre packaged food under GST, 12% tax on hotels with tariff up to Rs 1,000

రూ.2 లక్షలు అంతకంటే ఎక్కువ బంగారం, ఆభరణాలు, విలువైన రాళ్ల రవాణాకు ఎలక్ట్రానిక్ బిల్లు తప్పనిసరిగా ఉండాలని సిఫార్స్ చేసింది మంత్రుల బృందం.
ప్యాకింగ్ చేయని, లేబుల్స్ లేని, బ్రాండ్ లేని వస్తువులపై జీఎస్టీ మినహాయింపు కొనసాగుతుంది.
బ్యాంకులు జారీ చేసే చెక్కులపై 18 శాతం జీఎస్టీ వసూలు చేయాలని ప్రతిపాదించారు.
రోజుకు రూ.5000 పైబడితే రోగుల నుండి వసూలు చేసే హాస్పిటల్ గది చార్జ్ పైన 5 శాతం జీఎస్టీ ఉంటుంది. ఐసీయూను మినహాయించారు.

English summary

రూ.1000 లోపు హోటల్ గదిపై 12% జీఎస్టీ, వీటిలో మినహాయింపులు రద్దు | Pre packaged food under GST, 12% tax on hotels with tariff up to Rs 1,000

Bringing pre packaged and labelled food items such as wheat flour, puffed rice, curd/ lassi/ buttermilk and paneer under the GST net, withdrawing exemption for hotels with rent below Rs 1,000 a day.
Story first published: Wednesday, June 29, 2022, 8:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X