For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PPF vs NPS: రిటైర్మెంట్ కార్పస్ కోసం ఏది బెట్టర్?

|

రిస్క్-ఫ్రీ పెట్టుబడి సాధనాల్లో ఒకటి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF). ప్రస్తుతం పీపీఎఫ్ వడ్డీ రేటు 7.10 శాతంగా ఉంది. పీపీఎఫ్ పూర్తిగా డెబిట్ ఇన్‌స్ట్రుమెంట్. అలాగే, నేషనల్ పెన్షన్ స్కీమ్(NPS) మిక్స్డ్ అండ్ డెట్ రెండింటి మిశ్రమం. రిస్క్ తీసుకోవడానికి వెనుకడుగు వేసేవారు పీపీఎఫ్ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. కాస్త రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడేవారు ఎన్పీఎస్ ఖాతాను తెరువవచ్చు.

పీపీఎఫ్ వర్సెస్ ఎన్పీఎస్

పీపీఎఫ్ వర్సెస్ ఎన్పీఎస్

ఎవరైనా జీరో పర్సంట్ రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్‌ను ఎంచుకోవాలని భావిస్తే సదరు ఇన్వెస్టర్‌కు పీపీఎఫ్ మంచి ఎంపిక అని, అదే సమయంలో కొంత రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడేవారు ఎన్పీఎస్ పథకాన్ని ఎంచుకోవచ్చు. .ఎందుకంటే ఇది దీర్ఘకాలంలో పీపీఎఫ్‌తో పోలిస్తే అధిక రాబడులను అందిస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పైన పీపీఎప్, ఎన్పీఎస్ రెండు ఆదాయపు పన్ను మినహాయింపును అనుమతిస్తాయని చెబుతున్నారు. అయితే ఎన్పీఎస్‌లో సెక్షన్ 80సీసీడీ కింద అదనపు పన్ను రాయితీ అందుబాటులో ఉంది.

ఒక ఎన్పీఎస్ ఖాతాలో ఏడాదికి గరిష్టంగా అదనంగా రూ.50,000 వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. కాబట్టి పెట్టుబడిదారు కాస్త రిస్క్ తీసుకోవాలనుకుంటే 80సీ కింద 1.50 లక్షలకు బదులు రూ.50,000 వరకు ఆదాయపు పన్ను కింద క్లెయిమ్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తుంది.

పీపీఎఫ్, ఎన్పీఎస్‌లో వడ్డీ రేటు

పీపీఎఫ్, ఎన్పీఎస్‌లో వడ్డీ రేటు

పీపీఎఫ్‌లో వడ్డీ రేటు త్రైమాసికం ప్రాతిపదికన ఉంటుంది. వార్షిక ప్రాతిపదికన సమ్మేళనం చేయబడుతుంది. కాబట్టి పీపీఎఫ్ ఖాతాలో వడ్డీ రేటు త్రైమాసికం ప్రాతిపదికన మారవచ్చు. కానీ ఎన్పీఎస్ ఖాతాలో పెట్టుబడిదారులకు ఓ ఎంపిక ఉంటుంది. ఎన్పీఎస్ ఖాతాలో 75 శాతం ఈక్విటీ ఎక్స్‌పోజర్‌ను ఎంచుకోవచ్చు. పీపీఎఫ్‌లో పెట్టుబడి 100 శాతం డెట్ ఇన్వెస్ట్‌మెంట్. ఎన్పీఎస్‌లో డెట్, ఈక్విటీ మిశ్రమం. ఒక పెట్టుబడిదారు 60 శాతం ఎంచుకుంటే ఈక్విటీ ఎక్స్‌పోజర్, 40 శాతం డెట్ ఎక్స్‌పోజర్. దీర్ఘకాలంలో ఏడాదికి 12 శాతం రాబడి ఇస్తుంది.

ఏది బెట్టర్?

ఏది బెట్టర్?

జీరో రిస్క్ కావాలనుకునే వారు PPFలో ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్టర్ కాస్త రిస్క్ తీసుకునేవారైతే ఎన్పీఎస్ చాలా బెట్టర్. ఎన్పీఎస్ అకౌంట్ హోల్డర్ ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో రూ.2 లక్షల వరకు ఇన్‌కంట్యాక్స్ బెనిఫిట్స్ ప్రయోజనం పొందవచ్చు. పీపీఎఫ్ అయితే రూ.1.50 లక్షల వరకు ఉంది.

English summary

PPF vs NPS: రిటైర్మెంట్ కార్పస్ కోసం ఏది బెట్టర్? | PPF vs NPS investment: Which is better to build retirement corpus?

Public Provident Fund or PPF is one of the limited risk-free investment tool that can yield higher average rate of inflation as PPF interest rate today is 7.10 per cent per annum.
Story first published: Sunday, February 6, 2022, 16:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X