For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చాలా ఎక్కువ! PPF వడ్డీ రేటు 6.63% ఉండాలి, కానీ ప్రభుత్వం 7.10% ఇస్తోంది

|

అక్టోబర్-నవంబర్-డిసెంబర్ 2021 త్రైమాసికానికి గాను స్మాల్ సేవింగ్స్ స్కీం వడ్డీ రేట్లను ప్రభుత్వం యథాతథంగా ఉంచింది. అంటే పీపీఎప్, ఎన్ఎస్సీ, సుకన్య సమృద్ధి యోజన, కిసాన్ వికాస్ పత్ర వంటి స్మాల్ సేవింగ్స్ పథకాల వడ్డీ రేటులో మార్పు ఉండదు. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఉన్న వడ్డీ రేటు అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి వర్తిస్తుంది. ప్రతి త్రైమాసికం ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేటును ప్రకటిస్తుంది. వడ్డీ రేటును సవరించవచ్చు లేదా స్థిరంగా ఉంచవచ్చు. అయితే కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) తన ద్రవ్య విధాన నివేదికలో కీలక అంశాన్ని వెల్లడించింది. Q2:2020-21 నుండి ప్రభుత్వం వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తోందని పేర్కొంటూ, ప్రస్తుత Q3:2021-22 ఫార్ములా ఆధారిత రేట్ల కంటే 47 నుండి 178 బేసిస్ పాయింట్లు అదనంగా ఉన్నట్లు తెలిపింది.

ప్రభుత్వం పీపీఎఫ్, ఎన్ఎస్‌సీ, ఇతర ప్రభుత్వ ప్రాయోజిత సేవింగ్స్ స్కీమ్స్ కోసం ఫార్ములా ఆధారిత వడ్డీ రేట్ల కంటే 47 బేసిస్ పాయింట్ల నుండి 178 బేసిస్ పాయింట్లు అదనంగా అందిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ ఫార్ములా ఆధారిత అనాలసిస్ ప్రకారం ప్రస్తుత త్రైమాసికానికి వర్తించే పీపీఎఫ్ వడ్డీ రేటు Q3:2021-22లో 6.65 శాతంగా మాత్రమే ఉండాలి. కానీ ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ రేటు 7.10 శాతం.

 PPF Interest Rate Should Be 6.63% Instead of 7.10 percent

అలాగే, పోస్టాఫీస్ డిపాజిట్ టర్మ్ డిపాజిట్స్ మెచ్యూరిటీ 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలపై వడ్డీ రేటు వరుసగా 3.72%, 4.23%, 4.74%, 6.01% ఉండాలి. కానీ ఏడాది నుండి మూడేళ్లకు 5.50 శాతం, అయిదేళ్లపై 6.70 శాతం వడ్డీ రేటు ఉంది.
ఇక ఎన్ఎస్సీ VIII ఇష్యూ పైన ప్రభుత్వ వడ్డీ రేటు 6.14 శాతంగా ఉండాల్సింది. కానీ ప్రభుత్వం చాలా ఎక్కువగా 6.8 శాతం ఆఫర్ చేస్తోంది. అంటే 66 బేసిస్ పాయింట్లు అదనంగా ఇస్తోంది.
రికరింగ్ డిపాజిట్ అకౌంట్, మంత్లీ ఇన్‌కం స్కీం, కిసాన్ వికాస్ పత్ర, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన స్కీమ్స్ పైన వరుసగా 4.74 శాతం, 5.98 శాతం, 6.38 శాతం, 6.76 శాతం, 7.13 శాతంగా ఉండాలి. కానీ ప్రభుత్వం అంతకంటే ఎక్కువే ఇస్తోంది.

- పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ (SB) వడ్డీ రేటు 4.0%,

- 5-Year పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ (RD) వడ్డీ రేటు 5.8%,

- పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్ (TD) వడ్డీ రేటు 5.5% for 1 to 3 year A/c, and 6.7​ % for 5 year A/c,

- పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీమ్ అకౌంట్ (MIS) వడ్డీ రేటు 6​.6​ %,

- సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీం (SCSS) వడ్డీ రేటు 7.4​%,

- 15 ఇయర్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ (PPF) వడ్డీ రేటు 7.1%,

- సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు 7.6​%,

- నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) వడ్డీ రేటు 6.8% compounded annually but payable at maturity,

- కిసాన్ వికాస్ పత్ర (KVP) వడ్డీ రేటు 6.9 % compounded annually

English summary

చాలా ఎక్కువ! PPF వడ్డీ రేటు 6.63% ఉండాలి, కానీ ప్రభుత్వం 7.10% ఇస్తోంది | PPF Interest Rate Should Be 6.63% Instead of 7.10 percent

The Reserve Bank of India in its Monetary Policy Report of October 2021, has claimed that the government has kept interest rates on different small savings schemes steady since Q2:2020-21.
Story first published: Wednesday, October 20, 2021, 16:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X