For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పోస్టాఫీస్‌లో మారిన మినిమం బ్యాలెన్స్ రూల్స్, 10 రెట్లు పెంపు!

|

పోస్టాఫీక్ తన సేవింగ్స్ ఖాతాదారులకు షాకిచ్చింది. మినిమం బ్యాలెన్స్ రూల్స్‌ను సవరించింది. కనీస మొత్తాన్ని దాదాపు బ్యాంకులతో సమానం చేసింది. పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్‌లో ఇప్పటి వరకు ఉన్న మినిమం బ్యాలెన్స్ పరిమితిని రూ.50 నుంచి రూ.500కు పెంచింది. ఇందుకు సంబంధించి డిపార్టుమెంట్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది.

కరోనా వైరస్ దెబ్బ, 3 రోజులుగా పెరుగుతున్న బంగారం ధర: రికార్డ్ ధరకు సమీపంలో..కరోనా వైరస్ దెబ్బ, 3 రోజులుగా పెరుగుతున్న బంగారం ధర: రికార్డ్ ధరకు సమీపంలో..

మినిమం బ్యాలెన్స్ రూ.500 లేకుంటే ఫైన్ ఎంత?

మినిమం బ్యాలెన్స్ రూ.500 లేకుంటే ఫైన్ ఎంత?

పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాదారు తన అకౌంట్లో కనీసం రూ.500 మెయింటెన్ చేయని పక్షంలో పెనాల్టీ రూ.100 ఉంటుంది. మినిమం బ్యాలెన్స్ లేకుంటే జరిమానా కింద రూ.100 కట్ చేసుకుంటామని పోస్టల్ డిపార్టుమెంట్ తెలిపింది. ఆర్థిక సంవత్సరం చివరి పని దినం రోజున పెనాల్టీ డబ్బులు కట్ అవుతాయి.

రూ.50 మినిమం బ్యాలెన్స్‌తో రూ.2800 కోట్ల నష్టం

రూ.50 మినిమం బ్యాలెన్స్‌తో రూ.2800 కోట్ల నష్టం

అందరు సేవింగ్ అకౌంట్ హోల్డర్స్‌కు ఇది తెలియజేయాలని పోస్టాఫీస్ డైరెక్టరేట్.. అన్ని పోస్టల్ ఆఫీస్‌లకు ఆదేశాలు జారీ చేసింది. రూ.50 మినిమం బ్యాలెన్స్ పరిమితి కారణంగా ఇండియన్ పోస్టాఫీస్‌లకు ఏడాదికి రూ.2,800 కోట్ల నష్టం వస్తోందని తెలుస్తోందట. దీంతో ఈ నిర్ణయం తీసుకుంది.

అలా అయితే అకౌంట్ క్లోజ్

అలా అయితే అకౌంట్ క్లోజ్

పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్‌లో ఆర్థిక సంవత్సరం చివరి వర్కింగ్ డే రోజున జీరో బ్యాలెన్స్ ఉంటే ఆ అకౌంట్ ఆటోమేటిక్‌గా క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయడానికి రూ.500 చెల్లించాలి. ఇది కూడా నగదు రూపంలోనే చెల్లించాలి.

ట్రాన్సాక్షన్ ఉండాలి

ట్రాన్సాక్షన్ ఉండాలి

పోస్టాఫీస్ అకౌంట్‌ను సింగిల్‌గా లేదా జాయింట్‌గా లేదా మైనర్ పిల్లల పేరు మీద ఓపెన్ చేయవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత చెక్ బుక్, ఏటీఎం సౌకర్యం ఉంటుంది. పోస్టాఫీస్ సేవింగ్ అకౌంట్‌కు నామినీని కూడా పేర్కొనాలి. ఫైనాన్షియల్ ఇయర్‌లలో కనీసం ఒక్క ట్రాన్సాక్షన్ అయినా ఉండాలి. అంటే డబ్బులు ఉపసంహరించడం లేదా జమ చేయడం ఉండాలి.

డిపాజిట్‌పై వచ్చే వడ్డీ ట్యాక్స్ ఫ్రీ

డిపాజిట్‌పై వచ్చే వడ్డీ ట్యాక్స్ ఫ్రీ

పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్స్ పైన వచ్చే వడ్డీ మీద రూ.10,000 వరకు ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. పోస్టాఫీస్‌లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్ స్కీం, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ (NSC), సుకన్య సమృద్ధి యోజన (SSY), సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీం(SCSS) వంటి పాపులర్ స్మాల్ సేవింగ్ స్కీంలు ఉన్నాయి.

English summary

పోస్టాఫీస్‌లో మారిన మినిమం బ్యాలెన్స్ రూల్స్, 10 రెట్లు పెంపు! | Post office savings account alert: Minimum balance limit increased

The Department of Post recently increased the minimum balance limit from Rs 50 to Rs 500 for the savings account. The Department of Post issued Gazette notification in this regard.
Story first published: Monday, January 27, 2020, 15:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X