For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PNBకి మరో షాక్, రూ.3,600 కోట్లకు పైగా డీహెచ్ఎఫ్ఎల్ రుణాలు ఫ్రాడ్

|

హోమ్ లోన్ సంస్థ డీహెచ్ఎఫ్ఎల్‌కు ఇచ్చిన రుణాల విషయంలో మోసం జరిగినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) వెల్లడించింది. మొత్తం రూ.3,689 కోట్లు ($491 million) మేర ఫ్రాడ్ జరిగినట్లు తెలిపింది. ఈ మేరకు డీహెచ్ఎఫ్ఎల్ ( దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పోరేషన్) మోసపూరితంగా తీసుకున్నట్లు వెల్లడించింది.

గోడకు కొట్టిన బంతిలా.. భారత్ అదుర్స్! గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్థికవేత్తగోడకు కొట్టిన బంతిలా.. భారత్ అదుర్స్! గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్థికవేత్త

ఆర్బీఐ నిబంధనల ప్రకారం మోసపూరిత ఖాతాలపై నాలుగు క్వార్టర్‌లలో 100 శాతం ప్రొవిజనింగ్‌ను చేపట్టవలసి ఉంటుంది. దీంతో ఇప్పటికే డీహెచ్ఎఫ్ఎల్ ఖాతాపై రూ.1,246 కోట్ల ప్రొవిజనింగ్‌ను చేపట్టినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వెల్లడించింది. డీహెచ్ఎఫ్ఎంల్ రుణాలు దాదాపు 1 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వాటిని మాత్రం తీర్చడం లేదు. భారీ మొత్తంలో రుణాలు కలిగి ఉండి దివాళా కోర్టులకు చేరిన తొలి ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీగా డీహెచ్‌ఎఫ్‌ఎల్.

PNB reports over Rs 3600 crore DHFL loans as fraud

డీహెచ్ఎఫ్‌ఎల్ రుణాలు ఫ్రాడ్‌గా ప్రకటించిన నేపథ్యంలో ఉదయం పంజాబ్ నేషనల్ బ్యాంకు షేర్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత దాదాపు 2 శాతం నష్టపోయి రూ.35.15 వద్ద ముగిసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఇప్పటికే నీరవ్ మోడీ వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి వెళ్లిన విషయం తెలిసిందే. ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్‌తో పాటు ఇండస్ఇండ్ బ్యాంకు డీహెచ్ఎఫ్ఎల్ మోసపూరిత ఖాతాలపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించాయి.

English summary

PNBకి మరో షాక్, రూ.3,600 కోట్లకు పైగా డీహెచ్ఎఫ్ఎల్ రుణాలు ఫ్రాడ్ | PNB reports over Rs 3600 crore DHFL loans as fraud

Punjab National Bank said on Thursday it had reported loans made to Dewan Housing Finance Corporation Ltd worth 36.89 billion rupees ($491 million) to India's central bank as fraud.
Story first published: Friday, July 10, 2020, 16:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X