For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PM Modi: రానున్నది టెక్ సెకమన్న ప్రధాని.. వ్యాపార వర్గాల్లో ఫుల్ జోష్.. మోదీ కీలక ప్రసంగం..

|

Independence Day 2022: ప్రధాని మోదీ ఈరోజు ఎర్రకోట నుంచి తన స్వాతంత్ర్య దినోత్సవం ప్రసంగాన్ని ఇచ్చారు. ఇందులో భారత భవిష్యత్తుపై మాట్లాడుతూ డిజిటల్ ఇండియా ద్వారా సాంకేతికతను ప్రజలకు చేరువచేస్తున్న నేపథ్యంలో 'techade'అనే పదాన్ని ఉపయోగించారు.

ఆధునిక భారతంలో 5G, చిప్‌ల తయారీ వంటి నూతన సాంకేతికతల్లో భారత్ ముందుకు సాగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సాంకేతిక పరివర్తన, అవసరాన్ని నొక్కిచెప్పేందుకు 'techade'అంటూ ప్రస్తావించారు. దేశంలో త్వరలో 5G సేవలను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

pm modi about tech decade of india in his Independence Day 2022

డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని ప్రధాని అన్నారు. "చిన్న రైతులు, చిన్న పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల సామర్థ్యాలు సమర్థవంతమైన భారతదేశానికి హామీ" అని పేర్కొన్నారు. న్యాచురల్ ఫార్మింగ్ భారతదేశానికి కొత్త బలాన్నిస్తుందని పేర్కొన్నారు. గ్రీన్ ఉద్యోగాల కల్పనతో బహుళ ఉపాధి అవకాశాలు వస్తాయని అభిప్రాయపడ్డారు.

'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సందర్భంగా దేశంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ప్రధాని మోదీ "జై అనుసంధాన్" కోసం పిలుపునిచ్చారు. అంతరిక్ష రంగం నుంచి డ్రోన్ తయారీ వరకు అన్ని రంగాల్లో భారత్ వేగంగా పురోగమిస్తోందని ప్రధాని అన్నారు. ప్రధాని ఈ ప్రసగంతో భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని తెలుస్తోంది. దేశీయ మార్కెట్లు సైతం ఈ ఉత్సాహాన్ని రానున్న రోజుల్లో కొనసాగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

English summary

PM Modi: రానున్నది టెక్ సెకమన్న ప్రధాని.. వ్యాపార వర్గాల్లో ఫుల్ జోష్.. మోదీ కీలక ప్రసంగం.. | pm modi about tech decade of india in his Independence Day 2022 speach big boost to economy and businesses

pm modi about tech decade of india in his Independence Day 2022
Story first published: Monday, August 15, 2022, 10:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X