For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PM Kisan Update: PM కిసాన్ యోజన అప్‌డేట్.. 12వ విడత డబ్బులు ఎప్పుడు పడతాయి.. ఎలా చెక్ చేసుకోవాలంటే..

|

PM Kisan Update: మీరు కూడా PM కిసాన్ యోజన ప్రయోజనం పొందుతున్నట్లయితే.. ఈ వార్త మీకు తప్పక ఉపయోగపడుతుంది. ప్రధానమంత్రి కిసాన్ యోజన 12వ విడత సొమ్మును ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే విడుదల చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల్లో ఇది కూడా ఒకటి. ఈ పథకం ద్వారా ప్రభుత్వం దేశంలోని రైతులకు సంవత్సరానికి మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున అందిస్తోంది. చిన్న, మధ్యతరహా రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి ఈ పథకం ప్రారంభించబడింది.

 రైతులను ప్రశంశించిన ప్రధాని మోదీ..

రైతులను ప్రశంశించిన ప్రధాని మోదీ..

ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కిసాన్ యోజన, రైతులను ఉద్ధేశించి ఒక ట్వీట్ చేశారు. అందులో ప్రధాని ఏమన్నారంటే.. 'దేశం మొత్తం మన రైతు సోదరులు, సోదరీమణులను చూసి గర్విస్తోంది. రైతులు ఎంత బలంగా ఉంటే నవ భారతం అంత సుభిక్షంగా ఉంటుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, వ్యవసాయానికి సంబంధించిన ఇతర పథకాలు దేశంలోని కోట్లాది మంది రైతులకు కొత్త బలాన్ని అందిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను.' అని అన్నారు.

డబ్బులు ఎప్పుడు వస్తాయంటే..?

డబ్బులు ఎప్పుడు వస్తాయంటే..?

పీఎం కిసాన్ 12వ విడత డబ్బు ఈ నెలలో విడుదల కావచ్చు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద.. కేంద్ర ప్రభుత్వం రైతులకు సంవత్సరంలో మొదటి విడత ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు, రెండవ విడతను ఆగస్టు 1 నుంచి 30 నవంబర్ మధ్య, మూడవ విడత మెుత్తాన్ని డిసెంబర్ 1 నుంచి 31 మార్చి లోపు అందించింది. వీటిని నేరుగా రైతుల ఖాతాలకు జమ చేస్తారు. దీని ప్రకారం.. ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెల ప్రారంభంలో రెండవ విడత వాయిదాల సొమ్ము రావచ్చు.

 అప్లికేషన్ అప్‌డేట్ చేసుకోవచ్చు..

అప్లికేషన్ అప్‌డేట్ చేసుకోవచ్చు..

PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇన్‌స్టాల్‌మెంట్ పొందడంలో మీకు ఏదైనా సమస్య ఉంటే.. వెంటనే దాన్ని పరిష్కరించుకోండి. దీని కోసం.. మీరు హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా మెయిల్ ఐడీకి ఈ- మెయిల్ పంపడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు.

* ఇందుకోసం మీరు PM కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్- 155261 లేదా 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092 నంబర్లను సంప్రదించవచ్చు.

* మీరు మీ ఫిర్యాదును PM కిసాన్ ([email protected]) అధికారిక ఈ-మెయిల్ ఐడీకి కూడా మెయిల్ చేయవచ్చు.

* మీరు ఇప్పటి వరకు PM కిసాన్ యోజన కోసం దరఖాస్తు చేసుకోనట్లయితే.. అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in సందర్శించి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు.

డబ్బులు విడుదల వివరాలు ఇలా చెక్ చేసుకోవచ్చు..

డబ్బులు విడుదల వివరాలు ఇలా చెక్ చేసుకోవచ్చు..

1. ఇన్‌స్టాల్‌మెంట్ స్థితిని చూడటానికి, మీరు PM కిసాన్ వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

2. వెబ్‌సైట్‌లోని ఫార్మర్స్ కార్నర్ ఎంపికపై క్లిక్ చేయండి.

3. ఇప్పుడు బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

4. మీ స్క్రీన్‌పై కొత్త పేజీ తెరవబడుతుంది.

5. ఇక్కడ మీరు మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.

6. దీని తర్వాత మీరు మీ ఇన్‌స్టాల్‌మెంట్ స్థితి గురించి పూర్తి సమాచారాన్ని పొందుతారు.

English summary

PM Kisan Update: PM కిసాన్ యోజన అప్‌డేట్.. 12వ విడత డబ్బులు ఎప్పుడు పడతాయి.. ఎలా చెక్ చేసుకోవాలంటే.. | PM Kisan yojana scheme latest update over 12th round instalment release and how to check status and update information know here

PM Kisan yojana scheme latest update over 12th round instalment release
Story first published: Sunday, August 7, 2022, 7:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X