For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

pm kisan: రైతులకు మోడీ సర్కారు శుభవార్త.. కోట్లాది మందికి ప్రయోజనం

|

pm kisan: దేశ వ్యాప్తంగా రైతులకు తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం 2019 లో PM-KISAN పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ఏడాదికి 6 వేల చొప్పున మూడు సమాన వాయిదాల్లో రైతులకు చెల్లిస్తోంది. ఈ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాలకు ప్రత్యక్ష నగదు బదిలీ విధానం ద్వారా అందిస్తోంది.

ప్రస్తుతం అందిస్తున్న 6 వేలను 8 కి పెంచాలని భాజపా సర్కారు భావిస్తున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ మేరకు కొత్త బడ్జెట్‌ లో 68 వేల కేట్లు కేటాయించినట్లు సమాచారం. తద్వారా కేంద్రంపై 22 వేల కోట్ల రూపాయలు అదనపు భారం పడనుందని తెలుస్తోంది.

రెండింతల కోసం డిమాండ్ ఉన్నా..

రెండింతల కోసం డిమాండ్ ఉన్నా..

PM-KISAN ద్వారా కేంద్రం అందిస్తున్న మొత్తాన్ని రెండింతలు చేయాలని డిమాండ్ ఉంది. కానీ ఆర్థిక స్థిరత్వం, ఆదాయ వ్యయాలను గాడిలో పెట్టాల్సి రావడం, ద్రవ్లోల్బణ ఒత్తిళ్లపై ప్రభుత్వం దృష్టి పెట్టనుండటంతో.. కొంత మేర మార్పులు జరగవచ్చని తెలుస్తోంది. ఏడాది అనంతరం మరోసారి సమీక్షించి అప్పటి పరిస్థితికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

గ్రామీణార్థికానికి ఊతం

గ్రామీణార్థికానికి ఊతం

పథకం ప్రారంభంలో 31 మిలియన్ల లబ్ధిదారులు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 110 మిలియన్లకు చేరుకుంది. గత మూడేళ్లలో 2 ట్రిలియన్ల ఆర్థిక సాయాన్ని రైతులకు అందించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

PM KISAN ద్వారా ఇచ్చే తోడ్పాటును పెంచడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నగదు వినియోగం ఎగబాకి డిమాండ్ పుంజుకోవజానికి తోడ్పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. విద్య, వైద్యంతో పాటు రోజువారీ ఖర్చలు తీర్చుకునేందుకు కొంతవరకు ఈ మొత్తం ఉపయోగపడుతున్నట్లు చెబుతున్నారు.

ఇతర కార్మికులనూ చేర్చాలి

ఇతర కార్మికులనూ చేర్చాలి

PM-KISAN పథకాన్ని వ్యవసాయ, నిర్మాణ, ఇతర కార్మికులు, బలహీన వర్గాలకు యూనివర్సల్ బేసిక్ ఇన్‌ కమ్ గా మార్చాలని నీతి ఆయోగ్ సభ్యులు రమేష్ చంద్ గత నెలలో సూచించారు. 2016 ఆర్థిక సర్వేలోనూ అప్పటి ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ సైతం ఈ పద్ధితికి మద్ధతునిచ్చారు.

English summary

pm kisan: రైతులకు మోడీ సర్కారు శుభవార్త.. కోట్లాది మందికి ప్రయోజనం | PM KISAN amount going to increase by two thousands

PM KISAN amount going to increase..
Story first published: Tuesday, January 24, 2023, 7:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X