PM Kisan: రైతులకు శుభవార్త.. అక్టోబర్ 17, 18 తేదీల్లో పీఎం కిసాన్ 12వ విడత..!
పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి రూ.6 వేలు అందిస్తోంది. నాలుగు నెలలకు రూ.2వేల చొప్పున అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తోంది. కేంద్రం ఇప్పటికే 11 విడతలుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. పలు మీడియా నివేదికల ప్రకారం అతిత్వరలో 12వ విడత డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అక్టోబర్ 17, 18
ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 17, 18 తేదీల్లో జరగనున్న అగ్రి స్టార్టప్ కాంక్లేవ్ అండ్ కిసాన్ సమ్మేళన్ 2022 సందర్భంగా 12వ విడత రూ.2 వేలను విడుదల చేయనున్నారని పలు మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి.పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద రైతులకు డబ్బులు రావాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ లేని వారికి డబ్బులు జమ కావు.

పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019లో తీసుకొచ్చింది. ఇప్పటికే రైతులకు 11 విడతలుగా రూ.22 వేలు వచ్చాయి. రైతులుక ఎన్ని విడతల డబ్బులు వచ్చాయో తెలుసుకోవాలంటే ఇలా చేయండి.
1. ముందుగా https://pmkisan.gov.in/ వెబ్ సైట్ కు వెళ్లాలి
2. అక్కడ ఫార్మర్ కార్నర్ ఉంటుంది. అందులో ఈకేవైసీ, ఆన్ లైన్ రిఫండ్, న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్, ఎడిట్ ఆధార్, బెనిఫిషరీ స్టేటస్, బెనిఫిషరీ లిస్ట్, ఇతర ఆప్షన్లు ఉంటాయి.
3. మీరు బెనిఫిషరీ స్టేటస్ పై క్లిక్ చేయాలి.
4. అక్కడ మొబైల్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ అడుగుతుంది.
5. మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, ఇమేజ్ టెక్ట్స్ ఎంటర్ చేసి గెట్ డేటా మీద క్లిక్ చేయాలి
6. అప్పుడు మీకు ఎన్ని విడతల డబ్బు వచ్చిందో చూసుకోవచ్చు.


Click it and Unblock the Notifications