For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ATM Charges: ఏటీఎం ఛార్జీల మోత..! నాలుగు సార్లు కంటే ఎక్కువ డబ్బు విత్ డ్రా చేస్తే..?

|

ATM Charges: బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతున్న తరుణంలో వినియోగదారులు ఇప్పటికే ఆందోళనలో ఉన్నారు. అయితే ఈ తరుణంలో ఏటీఎం విత్ డ్రాలపై పరిమితులు, పరిమితి దాటి లావాదేవీలపై ఛార్జీల బాదుడు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

భారీగా ఛార్జీలు..!

భారీగా ఛార్జీలు..!

దేశంలోని బ్యాంకుల లావాదేవీలకు సంబంధించి సోషల్ మీడియాలో రెండు మెసేజ్‌లు వైరల్ అవుతున్నాయి. వాటిలోని సమాచారం ప్రకారం ఖాతాదారుడు ఏడాదిలో సేవింగ్స్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ 40 కంటే ఎక్కువ ఉంటే డిపాజిట్ చేసిన మొత్తం నుంచి ప్రతి లావాదేవీకి రూ.57.50 కట్ అవుతాయని ఉంది. రెండో మెసేజ్‌లో నాలుగుసార్లకు మించి ఏటీఎం నుంచి క్యాష్ డ్రా చేస్తే మొత్తం రూ.173 కట్ అవుతుందని అందులోని సారాశం. అయితే ఈ రెండు వార్తలు వైరల్ కావటంతో అనేక మంది ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.

ఇందులో నిజమెంత..

ప్రచారంలో ఉన్న ఈ రెండింటిలో వాస్తవం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ రెండు వాదనలు బోగస్ అని కేంద్రం తేల్చేసింది. లావాదేవీలకు సంబంధించిన రూల్స్ విషయంలో ఎస్‌బీఐ ఎలాంటి మార్పు చేయలేదని తెలుస్తోంది. ఖాతాదారులు బ్యాంక్ ATM నుంచి ప్రతి నెలా ఐదు ఉచిత లావాదేవీలు చేసుకునేందుకు బ్యాంక్ అనుమతించింది. ఈ పరిమితి పూర్తైన తర్వాత ఒక్కో లావాదేవీకి రూ.21 చెల్లించాల్సి ఉంటుంది. నెట్టింట్లో సంచలనంగా మారిన ఈ సమాచారంపై PIB తాజాగా ఫ్యాక్ట్ చెక్ విడుదల చేసింది.

RBI రూల్స్ ఇవే..

RBI రూల్స్ ఇవే..

ప్రభుత్వ విధానాలు, స్కీమ్స్ విషయంలో జరిగే తప్పుడు ప్రచారాలపై ప్రజలకు వాస్తవాలను వెల్లడించేందుకు, క్లారిటీ ఇచ్చేందుకు PIB పనిచేస్తుంది. RBI నిబంధనల ప్రకారం.. ఒక కస్టమర్ తన బ్యాంక్ ATM నుంచి ప్రతి నెలా ఐదు ఉచిత లావాదేవీలు చేయవచ్చు. అదేవిధంగా.. వారు మెట్రో నగరాల్లో ఇతర బ్యాంకుల ATMల నుంచి మూడు; నాన్-మెట్రో నగరాల్లో ఐదు ఉచిత లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు. ఉచిత లిమిట్ పూర్తైన తర్వాత బ్యాంకు ప్రతి లావాదేవీపై రూ. 21 రుసుము వసూలు చేయవచ్చు. ఈ ఏర్పాటు జనవరి 1, 2022 నుంచి ఈ రూల్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలులో ఉన్నాయి. 01,ఆగస్టు 2022 నుంచి అన్ని కేంద్రాల్లో ఆర్థిక లావాదేవీకి రూ.17, ప్రతి ఆర్థికేతర లావాదేవీకి రూ.6 ఇంటర్‌చేంజ్ రుసుమును విధించేందుకు RBI దేశంలోని బ్యాంకులకు అనుమతి ఇచ్చింది.

Read more about: atm charges rbi business news
English summary

ATM Charges: ఏటీఎం ఛార్జీల మోత..! నాలుగు సార్లు కంటే ఎక్కువ డబ్బు విత్ డ్రా చేస్తే..? | pib fact check gave clarity over viral news over atm transaction charges fake news

pib fact check gave clarity over viral news circulating in social media
Story first published: Friday, August 19, 2022, 10:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X