For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Phonepe: సింగపూర్ నుంచి భారత్‍కు మారిన ఫోన్ పే ప్రధాన కార్యాలయం..

|

భారత్ లో వేగంగా యూపీఐ చెల్లింపులు పెరుగుతున్నాయి. సెప్టెంబరులో యూపీఐ లావాదేవీలు సెప్టెంబర్ లో రికార్డును సృష్టించాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, UPI ప్లాట్‌ఫారమ్ లు సెప్టెంబర్‌లో 6.8 బిలియన్ల లావాదేవీలను నమోదు చేసింది. యూపీఐ చెల్లింపుల్లో ప్రధానంగా ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారు. ఫోన్ పే సంబంధించి త్వరలో ఐపీఓకు రానుంది.

సింగపూర్‌
అందుకే ఈ ఫిన్‌టెక్‌ సంస్థ తమ కార్యాలయ చిరునామాను సింగపూర్‌ నుంచి భారత్‌కు మార్చుకుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తయినట్లు ఫోన్ పే తెలిపింది. గత సంవత్సర కాలంగా ఫోన్‌పే సింగపూర్‌కు చెందిన ఇన్సూరెన్స్‌ బ్రోకింగ్‌ సర్వీసులు, వెల్త్‌ బ్రోకింగ్‌ మొదలైన వ్యాపారాలు, అనుబంధ సంస్థలు అన్నింటిని ఫోన్‌పే ప్రైవేట్‌ లిమిటెడ్‌-ఇండియాకు బదలాయించినట్లు స్పష్టం చేసింది.

Phone Pay headquarters shifted from Singapore to India

3,000 మంది ఉద్యోగులు
ఫోన్ పే 3,000 మంది ఉద్యోగులకు ఎంప్లాయీస్‌ స్టాక్‌ ఆప్షన్స్‌ లను జారీ చేయనుంది. ఈ ఫోన్ పేను ఫ్లిప్‌కార్ట్‌ మాజీ ఎగ్జిక్యూటివ్‌లు సమీర్‌ నిగమ్, రాహుల్‌ చారి, బుర్జిన్‌ ఇంజినీర్‌ కలిసి ఫోన్‌పేను ప్రారంభించారు. 2016లో ఫోన్ పేను ఫ్లిప్‌కార్ట్‌ కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికన్‌ రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ కొనుగోలు చేసింది. దీంతో ఫోన్‌పే వాల్‌మార్ట్‌లో భాగమైంది . ఫోన్ పే 8-10 బిలియన్‌ డాలర్ల వాల్యుయేషన్‌తో పబ్లిక్‌ ఇష్యూకి వచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

English summary

Phonepe: సింగపూర్ నుంచి భారత్‍కు మారిన ఫోన్ పే ప్రధాన కార్యాలయం.. | Phonepe headquarters shifted from Singapore to India

Phone Pay headquarters shifted from Singapore to India. PhonePay has made it clear that all the businesses and subsidiaries of Singapore based insurance broking services, wealth broking etc. have been transferred to PhonePay Private Limited – India.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X