For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భయం వద్దు: పెట్రోల్ ధరల పెరుగుదలపై ఊరట, 10 రోజుల్లో ఎంత పెరిగిందంటే?

|

ఇరాన్ టాప్ కమాండర్ ఖాసీమ్ సోలేమణిని అమెరికా రాకెట్ లాంఛర్లు హతమార్చడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఓ సమయంలో యుద్ధ వాతావరణం నెలకొంది. మూడో ప్రపంచ యుద్ధం ముంచుకు వస్తుందా అనే ఆందోళనలు కూడా చాలామందిలో కలిగాయి. కానీ ప్రస్తుతానికి చల్లబడింది. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల కారణంగా క్రూడాయిల్ ధరలు తద్వారా పెట్రోల్ ధరలు పెరుగుతాయని ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

సంక్రాంతి తర్వాత పెళ్లిళ్లు.. వారికి శుభవార్త!: 3వ రోజు భారీగా తగ్గిన బంగారంసంక్రాంతి తర్వాత పెళ్లిళ్లు.. వారికి శుభవార్త!: 3వ రోజు భారీగా తగ్గిన బంగారం

చమురు ధరలపై కేంద్రమంత్రి

చమురు ధరలపై కేంద్రమంత్రి

60 డాలర్ల వరకు ఉన్న బ్యారెల్ క్రూడాయిల్ ధరలు ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో 72 డాలర్లకు కూడా చేరుకున్నాయి. దీంతో ధరలు ముందు ముందు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. అయితే తాజాగా, శనివారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ అంశంపై స్పందించారు.

పెట్రో ధరలు పెరగవు... భయం అవసరం లేదు

పెట్రో ధరలు పెరగవు... భయం అవసరం లేదు

చమురు ధరల పెరుగుదల విషయంలో ఆందోళన చెందవలసిన అవసరం లేదని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులను ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. చమురు ధరల పెరుగుదలపై భయపడాల్సిన అవసరమేమీ లేదని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుదల ఎక్కువగా లేదని, గత రెండు రోజులుగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు సద్దుమణిగాయన్నారు.

మొదటి పది రోజుల్లో పెట్రోల్ ధర ఎంత పెరిగిందంటే?

మొదటి పది రోజుల్లో పెట్రోల్ ధర ఎంత పెరిగిందంటే?

2020 జనవరిలో మొదటి పది రోజుల్లో (1-10) పెట్రోల్ ధరలు 82 పైసలు, డీజిల్ ధర రూ.1.09 పైసలు పెరిగింది. శుక్రవారం వరకు పెరిగిన ధరలు శనివారం తగ్గాయి. శనివారం పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతకుముందు ఇరాన్ - అమెరికా ఉద్రిక్తతల కారణంగా పెరిగాయి. నిన్న ఢిల్లీలో లీటర్ పెట్రోలు రూ.75.90, కోల్‌కతాలో రూ.78.48, ముంబైలో రూ.81.49, చెన్నైలో రూ.78.86, హైదరాబాద్‌లో రూ.80.71గా ఉంది.

English summary

భయం వద్దు: పెట్రోల్ ధరల పెరుగుదలపై ఊరట, 10 రోజుల్లో ఎంత పెరిగిందంటే? | Petroleum Minister Dharmendra Pradhan allays fears over oil prices

Union Petroleum and Natural Gas Minister Dharmendra Pradhan on Saturday said there is no need to panic about oil prices owing to present tensions between Iran and the US.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X