For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెంచరీ దాటిన పెట్రోల్: ధరలు ఎందుకిలా పెరుగుతున్నాయి?

|

ఇంధన ధరల్లో నేడు (మే 26, బుధవారం) ఎలాంటి మార్పులేదు. దేశీయ చమురురంగ కంపెనీలు ధరలను స్థిరంగా ఉంచాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. నిన్న లీటర్ పెట్రోల్ పైన 23 పైసలు, లీటర్ డీజిల్ పైన 25 పైసలు పెరిగింది. నేడు స్థిరంగా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.93.44, లీటర్ డీజిల్ రూ.84.32గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర సెంచరీకి కేవలం 30 పైసల దూరంలో ఉంది.

డీజిల్ ధరలు రూ.92కు సమీపంలో ఉన్నాయి. ముంబైలో పెట్రోల్ రూ.99.71, డీజిల్ రూ.91.57 వద్ద ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.93.44, లీటర్ డీజిల్ రూ.84.32, కోల్‌కతాలో పెట్రోల్ రూ.93.49, డీజిల్ రూ.87.16, ముంబైలో పెట్రోల్ రూ.99.71, డీజిల్ రూ.91.57, చెన్నైలో పెట్రోల్ రూ.95.06, డీజిల్ రూ.89.11గా ఉంది.

కొద్ది రోజుల్లో మొబైల్ కనెక్షన్ మార్పు మరింత ఈజీ! ఓటీపీతో పోస్ట్ పెయిడ్ నుండి ప్రీపెయిడ్‌కుకొద్ది రోజుల్లో మొబైల్ కనెక్షన్ మార్పు మరింత ఈజీ! ఓటీపీతో పోస్ట్ పెయిడ్ నుండి ప్రీపెయిడ్‌కు

పెట్రోల్, డీజిల్ ధరల్లో తేడా ఎందుకంటే?

పెట్రోల్, డీజిల్ ధరల్లో తేడా ఎందుకంటే?

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వివిధ రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఉంటుంది. ఆయా రాష్ట్రాల వ్యాట్ కారణంగా ధరల్లో మార్పు ఉంటుంది. రాజస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ పైన అత్యధిక వ్యాట్ ఉంది. అందుకే అక్కడ లీటర్ పెట్రోల్ పలు ప్రాంతాల్లో రూ.100 దాటింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలోను ఎక్కువ వ్యాట్ ఉంది.

అందుకే ఈ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ రూ.100 దాటింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ ట్యాక్స్‌ను వేయడం పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటానికి కారణం. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు రంగ కంపెనీలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి.

రాజస్థాన్‌లో వ్యాట్ తగ్గించినా...

రాజస్థాన్‌లో వ్యాట్ తగ్గించినా...

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా లాక్ డౌన్, కఠిన ఆంక్షలతో పెట్రోల్, డీజిల్ వినియోగం క్షీణించింది. రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో 75 శాతం డిమాండ్ పడిపోయింది. రాజస్థాన్‌లో పెట్రోల్ పైన 36 శాతం, డీజిల్ పైన 26 శాతం వ్యాట్ ఉంది. మణిపూర్ తర్వాత దేశంలో ఏ రాష్ట్రానికైనా ఇది అత్యధికం. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన 2 శాతం చొప్పున వ్యాట్‌ను తగ్గించింది. అయినప్పటికీ మణిపూర్(36.5 శాతం) తర్వాత రాజస్థాన్‌లో వ్యాట్ అధికం.

సామాన్యులపై పెట్రో భారం

సామాన్యులపై పెట్రో భారం

సాధారణ పౌరులకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుండి ఉపశమనం కల్పించాలంటే రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను ఆరు శాతం మేర తగ్గించాలని రాజస్థాన్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సునిత్ బాగాయ్ అన్నారు. రాష్ట్రంలో అధిక వ్యాట్ కారణంగా నిత్యావసర ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇది సామాన్యులకు భారంగా మారిందన్నారు.

English summary

సెంచరీ దాటిన పెట్రోల్: ధరలు ఎందుకిలా పెరుగుతున్నాయి? | Petrol prices near Rs 100 in Mumbai, why are fuel prices rising?

Petrol and diesel rates have been kept unchanged on Wednesday by the oil marketing companies. Fuel prices have witnessed sporadic rise in the last few days.
Story first published: Wednesday, May 26, 2021, 15:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X