For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pakistan: మన కంటే పాకిస్థాన్‌లో పెట్రోల్ రేటు తక్కువ.. సామాన్యులకు ఊరటనిస్తున్న దాయాది.. మనకెందుకిలా..?

|

Pakistan: అనేక విషయాల్లో పాకిస్థాన్ కంటే ముందున్న భారతదేశం చమురు ధరల విషయంలో మాత్రం వెనుకబడింది. పాక్ ప్రభుత్వం మన కంటే తక్కువ ధరలకే తమ ప్రజలకు పెట్రోల్ అందించటం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.

 అప్పుల్లో ఉన్నప్పటికీ..

అప్పుల్లో ఉన్నప్పటికీ..

అధిక ద్రవ్యోల్బణం నుంచి ఆర్థిక సంక్షోభం, ఇంధన కొరత వంటి సమస్యలను ఎదుర్కొంటున్న పాక్ అదనపు ఆదాయం కోసం ఇటీవల ఇంధన ధరలను పెంచింది. ఒకపక్క ముడిచమురు ధరలు తగ్గుతున్నప్పటికీ పెట్రో ధరలను మాత్రం పెంచింది. ఇది పాక్ ప్రజలపై భారం మోపుతున్నప్పటికీ అవి భారత్ కంటే తక్కువగా ఉన్నాయి.

పెంచిన ధరలు ఇలా..

పెంచిన ధరలు ఇలా..

ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పాకిస్థానీలకు షాక్ ప్రభుత్వం బుధవారం లీటరు పెట్రోల్‌పై రిటైల్ ధరను రూ.1.45 పెంచింది. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.235.98 నుంచి పాకిస్తానీ రూపాయల్లో 237.43కి చేరుకుంది.

ఫారెక్స్ రేట్ల ప్రకారం..

ఫారెక్స్ రేట్ల ప్రకారం..

అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్ ప్రకారం.. ఒక భారత రూపాయికి, 3.02 పాకిస్థానీ రూపాయలుగా ఉంది. ఈ లెక్కన పాకిస్థాన్ కరెన్సీలో 237.43 రూపాయల లీటర్ పెట్రోల్ ధరను మన కరెన్సీలో మార్చుకుంటే అది రూ.78.75లకు సమానం. అంటే లీటర్ పెట్రోల్ కేవలం రూ.78.75 మాత్రమే. భారత దేశంలో ఈ ధర సెంచరీని దాటేయటంతో సామాన్యులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

నాలుగు నెలలుగా..

నాలుగు నెలలుగా..

దాదాపు 123 రోజులుగా.. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా భారత్‌లో ముడి చమురు ధరలు ఎటువంటి మార్పు లేకుండా అమ్ముడవుతున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భారీగానే తగ్గాయి. కానీ సామాన్య వాహనదారులకు ఆ తగ్గింపులు అందటం లేదు. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72 ఉండగా.. చెన్నైలో రూ.102.63కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా ధరల తగ్గింపు జరగలేదని భారత ప్రభుత్వం తెలిపింది.

 పాకిస్థాన్‌లో ధరల తగ్గింపు..

పాకిస్థాన్‌లో ధరల తగ్గింపు..

సెప్టెంబర్ 31 నాటికి పాకిస్థాన్‌లో డీజిల్ ధర లీటరుకు 4.26 రూపాయలు తగ్గగా, కిరోసిన్ ధర 8.30 రూపాయలను అక్కడి ప్రభుత్వం తగ్గించింది. దీని ద్వారా పాకిస్థాన్‌లో లీటర్ పెట్రోల్ రూ.237.43, డీజిల్ రూ.247.43, కిరోసిన్ రూ.202.02కు అమ్ముతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల మార్పు, కరెన్సీ మారకంలో మార్పులకు అనుగుణంగా ఇవి జరుగుతున్నట్లు తెలుస్తోంది.

English summary

Pakistan: మన కంటే పాకిస్థాన్‌లో పెట్రోల్ రేటు తక్కువ.. సామాన్యులకు ఊరటనిస్తున్న దాయాది.. మనకెందుకిలా..? | petrol prices are much less in pakistan than india know full details

petrol prices are much less in pakistan than india know full details
Story first published: Wednesday, September 21, 2022, 15:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X