For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెల రోజుల్లో 16సార్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

|

ముంబై: పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (జూన్ 7, సోమవారం) పెరిగాయి. పెరుగుతున్న చమురు ధరలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నేడు లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు 27 పైసల నుండి 28 పైసలు పెరిగాయి. ఈ నెలలో ధరల పెరుగుదల ఇది నాలుగోసారి. గత నెలలో పెట్రోల్ డీజిల్ ధరలు పదహారుసార్లు పెరిగాయి. ఈ నెలలో ఆ ఏడు రోజుల్లో నాలుగుసార్లు పెరిగాయి. దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీల ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.31, లీటర్ డీజిల్ రూ.86.22కు పెరిగింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.101.52, డీజిల్ రూ.93.58కి చేరుకుంది.

మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, తెలంగాణ, లడక్‌లోని పలు ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌, మధ్యప్రదేశ్‌లోని అనూన్‌నగర్‌లో లీటర్ పెట్రోల్ రికార్డ్ స్థాయికి చేరుకుంది. శ్రీగంగానగర్‌లో పెట్రోల్ రూ.106.39, డీజిల్ రూ. 99.24, అనూప్‌నగర్‌లో పెట్రోల్ రూ.106.24, డీజిల్ రూ. 97.37, పర్భనిలో పెట్రోల్ రూ.103.88, డీజిల్ రూ. 94.42, భోపాల్‌లో పెట్రోల్ రూ.103.52, డీజిల్ రూ. 94.84, జైపూర్‌లో పెట్రోల్ రూ.101.94, డీజిల్ రూ. 95.16కి చేరుకుంది. గత నెల రోజుల కాలంలో కూడా పెట్రోల్ ధరలు 16సార్లు పెరిగాయి.

 Petrol Price Touches Rs 95 per litre in Delhi: Hiked 16 Times in Last One Month

వివిధ నగరాల్లో పెట్రోల్ ధరలు చూసుకుంటే హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.98.48, డీజిల్ రూ.93.08, చెన్నైలో పెట్రోల్ రూ.96.23, డీజిల్ రూ.90.38, కోల్‌కతాలో పెట్రోల్ రూ.94.76, డీజిల్ రూ.88.51, బెంగళూరులో పెట్రోల్ రూ.97.92, డీజిల్ రూ.90.81గా ఉంది.

English summary

నెల రోజుల్లో 16సార్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు | Petrol Price Touches Rs 95 per litre in Delhi: Hiked 16 Times in Last One Month

The state-run oil marketing companies (OMCs) hiked the prices of petrol and diesel by 27-28 paise per litre on Monday, June 7. With the latest round of increase, the price of both fuels has reached new highs across the country.
Story first published: Monday, June 7, 2021, 16:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X