For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెల రోజుల్లో పెట్రోల్ రూ.5.16, డీజిల్ రూ.5.74 పెంపు

|

ముంబై: పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (జూన్ 9, బుధవారం) పెరిగాయి. పెరుగుతున్న చమురు ధరలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నేడు లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు 25 పైసల నుండి 25 పైసలు పెరిగాయి. గత నెలలో పెట్రోల్ డీజిల్ ధరలు పదహారుసార్లు పెరిగాయి. ఈ నెలలో ఆ తొమ్మిది రోజుల్లో ఐదుసార్లు పెరిగాయి. దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీల ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.56, లీటర్ డీజిల్ రూ.86.47కు పెరిగింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.101.76, డీజిల్ రూ.93.85కి చేరుకుంది.

గత మే 4వ తేదీ నుండి చమురు ధరలు పలుమార్లు పెరిగాయి. మే నెలలో పదహారుసార్లు, జూన్ నెలలో ఐదుసార్లు పెరిగాయి. ఈ కాలంలో లీటర్ పెట్రోల్ పైన రూ.5.16, డీజిల్ పైన రూ.5.74 పెరిగింది. అంటే దాదాపు రూ.5 నుండి రూ.6 మధ్య పెరిగింది.

Petrol Price Nears Rs 102 Per Litre in Mumbai Today, Check fuel Prices in Your City

రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లడక్ ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 కంటే పైకి చేరుకుంది. రాజధాని నగరాల్లో భోపాల్, ముంబై, జైపూర్‌లలో రూ.100 కంటే పైకి చేరుకుంది. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.64, లీటర్ డీజిల్ రూ.99.50కి చేరుకుంది. మధ్యప్రదేశ్ అన్నుపూర్‌లో లీటర్ పెట్రోల్ రూ.10.29, లీటర్ డీజిల్ రూ.97.44గా ఉంది.

English summary

నెల రోజుల్లో పెట్రోల్ రూ.5.16, డీజిల్ రూ.5.74 పెంపు | Petrol Price Nears Rs 102 Per Litre in Mumbai Today, Check fuel Prices in Your City

Prices of petrol and diesel have been on the rise since last month after oil marketing companies (OMCs) resumed their price revisions ending an 18-day respite. The pause had coincided with the assembly elections in key states like West Bengal, Tamil Nadu, Kerala, across the country.
Story first published: Wednesday, June 9, 2021, 17:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X